MLA Pinnelli: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్?
ABN , Publish Date - May 22 , 2024 | 03:48 PM
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంని పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంని పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని (Ramakrishna Reddy Pinnelli) పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే పిన్నెల్లి అరెస్ట్‌ని పోలీసులు ఇప్పటివరకు నిర్ధారించలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి కోసం బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.
మహబూబ్‌నగర్ జిల్లాలో షెల్టర్?
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు షెల్టర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా మూలాలు ఉన్న పత్తి వ్యాపారులు ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ఏపీ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఏపీ పోలీసులకు ఇంతవరకు పిన్నెల్లి ఆచూకీ లభించలేదని తెలుస్తోంది. పిన్నెల్లి ఇద్దరు సోదరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉండడంతోనే పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో (202) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణలో కూడా వేట కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు
వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?
For more Election News and Telugu News