ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election: రాయి ఫోర్స్‌గా వచ్చింది.. పథకం ప్రకారమే దాడి, ఈసీకి వైసీపీ నేతల కంప్లైంట్

ABN, Publish Date - Apr 14 , 2024 | 07:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ప్రకంపనలు రేపుతోంది. రాయి దాడిని నేతలందరూ ఖండించారు. దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

YCP Leaders Complaint To EC On Attack Of CM YS Jagan Sdr

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jagan) జరిగిన రాయి దాడి ప్రకంపనలు రేపుతోంది. రాయి దాడిని నేతలందరూ ఖండించారు. దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేసిన వారిలో సజ్జల రామకృష్ణా రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.

AP Election 2024: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమిదే..!


‘సీఎం జగన్‌పై (YS Jagan) దాడిని పార్టీలకతీతంగా అందరూ ఖండించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖండించారు. ఘటనను డ్రామాగా హేళన చేయడం సరికాదు. కోడికత్తి 2.0 అని అనడం పద్ధతి కాదు. చంద్రబాబు రెచ్చగోట్టేలా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయలో మొదలై ప్రభంజనంలా మారింది. సీఎం జగన్‌కి వస్తోన్న స్పందనను చూసి తట్టుకోలేక రెచ్చగోట్టేలా మాట్లాడటం తగదు. జగన్‌పై దాడి పథకం ప్రకారం జరిగింది. ఆ రాయి ఫోర్స్‌గా వచ్చింది. సీఎం జగన్‌ను తగిలి వెల్లంపల్లిని తాకింది అని’ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 07:00 PM

Advertising
Advertising