Share News

Pregnancy: ప్రెగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Sep 30 , 2024 | 02:20 PM

చాలా మంది ఉదయం లేచాక కాఫీ తాగేందుకు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలోనే ప్రగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా అన్న సందేహాలు తలెత్తుతుంటాయి. కచ్చితంగా తాగొద్దని ఎవరూ చెప్పలేదు కానీ కాఫీ అలవాటు ఉన్న మహిళ గర్భం దాల్చాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Pregnancy: ప్రెగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఉదయం లేచాక కాఫీ తాగేందుకు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలోనే ప్రగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా అన్న సందేహాలు తలెత్తుతుంటాయి. కచ్చితంగా తాగొద్దని ఎవరూ చెప్పలేదు కానీ కాఫీ అలవాటు ఉన్న మహిళ గర్భం దాల్చాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు (Health).

Chewing Gum: అలర్ట్.. రోజూ బబుల్ గమ్ నమిలితే జరిగేది ఇదే!

అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒమెస్ట్రీషియన్స్ అండ్ గౌనకాలజిస్ట్స్ ప్రకారం ప్రెగ్నెంట్ మహిళలు రోజుకు 200 మిల్లీ గ్రాముల కెఫీన్‌కు మించి తీసుకోకూడదు. కాఫీ తాగొచ్చుకానీ దాని ద్వారా ఎంత కెఫీన్ శరీరంలోకి వెళుతోందన్న అంశంపై దృష్టిపెట్టాలి. కెఫీన్ కారణంగా గర్భవతులతో పాటు కడుపులో ఉన్న పిండంపై కూడా ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ! ఎందుకంటే..


గర్భవతులు రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదనేది వైద్యులు చెప్పేమాట. కొందరు ఇంతకంటే తక్కువ తీసుకోవాలని కూడా సూచిస్తుంటారు. పరిమిత మొత్తంలో కూడా కెఫీన్‌తో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నమ్ముతారు. కెఫీన్ కారణంగా గర్భస్త పిండాల పరిమాణం ఉండవలిసిన దానికంటే తక్కువ ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.

ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

పరిశోధకుల ప్రకారం, కెఫీన కారణంగా గర్భాశయం, ప్లాసెంటాలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా పిండానికి రక్త సరఫరా తగ్గి దాని ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, పిండంలోని స్ట్రెస్ హార్మోన్లపై కూడా కెఫీన్ ప్రభావం పడుతుంది. దీంతో, గర్భస్థ శిశువులు కొన్ని సందర్భాల్లో వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే కెఫీన్‌తో బరువు తక్కువ ఉన్న శిశువులు, అబార్షన్లు, నెలల నిండకుండా పుట్టడం వంటి సమస్యలేవీ రావని కూడా అధ్యయనాలు తేల్చాయి.


మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!

వైద్యులు చెప్పే దాని ప్రకారం, గర్భంతో ఉన్న మహిళలు రాత్రి భోజనం తరువాత కాఫీ తాగడం మానాలి. వీలైనంత వరకూ పాలు ఎక్కువగా ఉన్న కాఫీ తాగితే కెఫీన్ సమస్యలను కొంత వరకూ నివారించవచ్చు.

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Sep 30 , 2024 | 02:24 PM