Share News

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:41 AM

బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.

15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య

లండన్‌, సెప్టెంబరు 16: బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది. ఇది జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. లండన్‌ నగరంలో చదువుకునే విద్యార్థులు వీసా దరఖాస్తు సమయంలో నెలకు 1,483 పౌండ్ల(సుమారు రూ.1.65 లక్షలు) చొప్పున 9 నెలలకు గాను బ్యాంకు నిల్వలను చూపించాల్సి ఉంటుంది. లండన్‌ నగరం వెలుపల చదివే వారికి ఆ మొత్తం నెలకు 1,136 పౌండ్లు(సుమారు రూ.1.26 లక్షలు)గా నిర్ణయించారు. వీసా దరఖాస్తు సమయంలో విద్యార్థులు 9 నెలలకు గాను బ్యాంకు నిల్వలను చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తొమ్మిది నెలల మొత్తం రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షలుగా ఉంటుంది.

Updated Date - Sep 17 , 2024 | 03:41 AM