Lok Sabha Elections 2024: మోదీజీ...మీ మాటలు కట్టిపెట్టండి... ఫరూక్ ఫైర్
ABN , Publish Date - May 01 , 2024 | 08:16 PM
ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మాతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
రాజౌరి: ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మాతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. ''వాళ్లకు ఓటు వేయడమంటే నరకానికి (మరణాంతరం) వెళ్లడానికి సిద్ధపడటమే'' అని నిప్పులు చెరిగారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజౌరి జిల్లా థానమండి ఏరియాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడుతూ, దేశ మనుగడకు మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఒక ముప్పుగా పరిణమించిందని ఆక్షేపించారు. ''మతం పేరుతో దేశాన్ని విడగొట్టొద్దు. లేదంటే పెనుతుఫానుతో దేశమనుగడే ప్రమాదంలో పడుతుంది. ప్రజలను విడగొట్టడానికి బదులు దేశ ఐక్యత గూరించి మాట్లాడటం మంచిది'' అని ప్రధానికి ఆయన హితవు పలికారు.
Lok Sabha Elections 2024: ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత డౌట్..
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజల ధనాన్ని ఎక్కువ మంది పిళ్లలు కనే వాళ్లకు పంచిపెట్టేస్తుందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ముస్లింలు అన్ని మతాలను గౌరవిస్తాయని, అల్లా కూడా తమకు అదే చెప్పాడని, ఎవరి హక్కులను ముస్లింలు ఊడలాక్కోరని అన్నారు. కాంగ్రెస్ ప్రజల మంగళసూత్రాలను కూడా ఊడలాక్కుందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుల్వామా వెళ్తూ తన వాహనాన్ని ఆపి, ఒక పేద హిందూ మహిళకు మంగళసూత్రం ఇస్తానని వాగ్దానం చేశారని గుర్తుచేశారు. 'ఇండియా' కూటమికి ఎవరైతే వ్యతిరేకులో వారు దేశానికి వ్యతిరేకులను అన్నారు. అలాంటి వారు మరణించాక నరకానికి పోవడం తథ్యమని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నిక మే 25న జరుగనుంది.
Read Latest National News and Telugu News