Share News

మహా వికాస్‌ అఘాడీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి!

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:15 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు దూకుడు పెంచాయి. నవంబరు 20 జరిగే ఎన్నికల దృష్ట్యా మహా వికాస్‌ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని ఎన్సీపీ(ఎస్పీ)

మహా వికాస్‌ అఘాడీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి!

ఇప్పటి వరకు 200 సీట్లపై అవగాహన: శరద్‌ పవార్‌

పుణె, అక్టోబరు 17: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు దూకుడు పెంచాయి. నవంబరు 20 జరిగే ఎన్నికల దృష్ట్యా మహా వికాస్‌ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని ఎన్సీపీ(ఎస్పీ) సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 200 సీట్లపై కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరిందని గురువారం వెల్లడించారు. ‘‘సీట్ల పంపకంపై కూటమి నేతలతో మా పార్టీ తరుఫున జయంత్‌ పాటిల్‌ చర్చిస్తున్నారు. నాకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు దాదాపు 200 సీట్లపై కూటమి నేతలు అవగాహనకు వచ్చారు. హరియాణా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నాం. హరియాణాలో కాంగ్రెస్‌ పరాజయ ప్రభావం మహారాష్ట్రపై ఏ మాత్రం ఉండదు’’ అని పవార్‌ పేర్కొన్నారు. అయితే శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీసీ) చీలిక అనంతరం జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

Updated Date - Oct 18 , 2024 | 06:15 AM