Share News

Kharge: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:33 AM

గదగ్‌లో ఆదివారం కర్ణాటక మాజీ మంత్రి కేహెచ్‌ పాటిల్‌ శతజయంతి సభలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌తో ఉత్తరాది రాష్ట్రాల్లో 30శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు.

Kharge: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

ఉత్తరాదికి 30% సీట్లు పెరుగుతాయి: ఖర్గే

బెంగళూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం వాటిల్లుతుందని, లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. గదగ్‌లో ఆదివారం కర్ణాటక మాజీ మంత్రి కేహెచ్‌ పాటిల్‌ శతజయంతి సభలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌తో ఉత్తరాది రాష్ట్రాల్లో 30శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ముఖ్యులంతా సమైక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదం గురించి మాట్లాడుతున్న కేంద్రప్రభుత్వం.. ప్రజలకు అవసరమైన పనులకోసం గ్రాంట్లలో ఎందుకు కోత పెడుతోందని నిలదీశారు. కర్ణాటకలో సహకార బ్యాంకులకు నాబార్డు నిధుల్లో 58శాతం కోత విధించిందని, తద్వారా లక్షలాది రైతులకు ఈ ఏడాది పంటరుణాలు అందలేదని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 05:33 AM