Bengaluru: బెంగళూరులో రూ.75 కోట్ల డ్రగ్స్
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:31 AM
అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు దక్షిణాఫ్రికా మహిళలను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37.87 కేజీల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 14న విదేశీ మహిళలు ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం అందడంతో..

బెంగళూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో పోలీసులు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు దక్షిణాఫ్రికా మహిళలను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37.87 కేజీల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 14న విదేశీ మహిళలు ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం అందడంతో.. వారిని బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని నీలాద్రినగర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి..