Ajit Doval: ప్రపంచ నిఘా సంస్థల చీఫ్‌లతో డోభాల్ భేటీ
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:17 AM
సదస్సుకు అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, కెనడా నిఘా విభాగాధిపతి డేనియల్ రోజర్స్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విదేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ చర్చించింది.

న్యూఢిల్లీ, మార్చి16: ప్రపంచ నిఘా సంస్థల చీఫ్‌లతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఢిల్లీలో భేటీ అయ్యారు. డోభాల్ నేతృత్వంలో సాగిన సదస్సులో ఉగ్రవాదం సహా పలు భద్రతా సవాళ్లపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సదస్సుకు అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, కెనడా నిఘా విభాగాధిపతి డేనియల్ రోజర్స్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విదేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ చర్చించింది. అంతకుముందు డోభాల్.. తులసి గబ్బార్డ్‌తో ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపారు. మరోవైపు, భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ 10వ సదస్సు సోమవారం ఇక్కడ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి..