Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్ వారెంట్
ABN, Publish Date - Jun 14 , 2024 | 03:52 AM
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
పోక్సో కేసులో జారీ చేసిన బెంగళూరు కోర్టు
సీఐడీ అరెస్టు చేసే అవకాశం
బెంగళూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం డీజీపీ అలోక్ మోహన్ ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు.
కాగా, బాధిత బాలిక తల్లి గతనెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కేసులో చార్జిషీట్‌ను ఈనెల 15వ తేదీలోగా దాఖలు చేయా ల్సి ఉన్నందున సీఐడీ అధికారులు యడియూరప్పకు నోటీసులు జారీ చేయగా, ఈనెల 17న విచారణకు హాజరువుతానని యడియూరప్ప సమాచారం పంపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన యడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేసును విచారిస్తున్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రమేశ్ గురువారం యడియూరప్పపై నాన్‌బెయిలబుల్ వా రెంట్ జారీ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. కాగా, పోక్సో కేసులో అవసరమైతే యడియూరప్ప ను సీఐడీ విభాగం అరెస్టు చేసే అవకాశం ఉందని హోంమంత్రి పరమేశ్వర్ గురువారం చెప్పారు.
Updated Date - Jun 14 , 2024 | 03:52 AM