ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: బీజేపీ పెద్ద స్కెచే వేసిందిగా..? లోక్‌సభ నుంచి బరిలోకి ఆ క్రికెటర్..!!

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:38 PM

పశ్చిమ బెంగాల్‌‌పై బీజేపీ ఫోకస్ చేసిందా..? ఇటీవల బెంగాల్‌లో వరసగా ప్రధాని మోదీ పర్యటన.. ఆ తర్వాత కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కొనసాగింపుగా మరో ఎత్తుగడ బీజేపీ వేసింది.

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌‌పై బీజేపీ (BJP) ఫోకస్ చేసిందా..? ఇటీవల బెంగాల్‌లో వరసగా ప్రధాని మోదీ పర్యటన.. ఆ తర్వాత కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో (BJP) చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో సత్తా చాటాలని బీజేపీ (BJP) వ్యూహలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కొనసాగింపుగా మరో ఎత్తుగడ వేసింది బీజేపీ. ఓ ప్రముఖ క్రికెటర్‌ను బెంగాల్ (Bengal) లోక్ సభ బరిలో దింపనుందనే వార్తలు వస్తున్నాయి.

ఎవరంటే..?

లోక్ సభ ఎన్నికల్లో క్రికెటర్ మహ్మద్ షమీని బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది. ఇటీవల రగడ నెలకొన్న సందేశ్ ఖాలి పరిధిలో గల బరిషిత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతామని లీకులు ఇస్తోంది. అక్కడ నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించుకుంటామని ధీమాతో ఉంది. బెంగాల్ గడ్డపై షమీ విజయంతో తమ ఖాతా తెరవాలని ఊబలాట పడుతోంది. బరిసిత్‌లో మైనార్టీల సంఖ్య ఎక్కువ అని, షమీ బరిలోకి దిగితే విజయం ఖాయం అని స్థానిక బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

మోదీతో సాన్నిహిత్యం..?

ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో షమీ ఇరగదీశాడు. బాల్‌తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఫైనల్‌లో మ్యాచ్ ఓడిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ వద్దకు ప్రధాని మోదీ వచ్చారు. టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో షమీని ప్రత్యేకంగా అభినందించారు. చాలా చక్కగా ఆడావని మరీ మరీ చెప్పారు. షమీని కౌగిలించుకున్నారు కూడా. ఆ తర్వాత మహ్మద్ షమీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో బీజేపీలో చేరడమో.. లేదంటే ప్రచారం చేస్తారని భావించారు. అనూహ్యంగా లోక్ సభ బరిలో నిలుపుతామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.

బెంగాల్‌తో అనుబంధం

మహ్మద్ షమీకి బెంగాల్‌తో అనుబంధం ఉంది. బెంగాల్ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడతారు. అలా అతడిని బెంగాల్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. షమీని లోక్ సభ నుంచి బరిలోకి దింపుతారనే ఊహాగానాలు నెలకొనగా.. షమీ స్వగ్రామం అమ్రోహలో స్టేడియం నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదత్యనాథ్ ప్రకటన చేశారు. షమీకి ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలో లోక్ సభ బరిలో దింపుతామని బీజేపీ అంటోంది. దీనిపై షమీ స్పందించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

Updated Date - Mar 08 , 2024 | 01:48 PM

Advertising
Advertising