మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

ABN, Publish Date - Mar 05 , 2024 | 11:02 AM

ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

నాగ్‌పూర్: ప్రధాని మోదీకి (PM Modi) కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు (Lalu Prasad Yadav) కౌంటర్ ఇస్తున్నారు. మేమంతా ప్రధాని మోదీ కుటుంబ సభ్యుల అని చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ బయోలో పేరు తర్వాత బ్రాకెట్‌లో ‘మోదీ కా పరివార్’ అని రాస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాశారు. ఆ జాబితాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) చేరారు. నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ నమో యువ మహా సమ్మేళనలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు.

‘మేమంతా ప్రధాని మోదీ (PM Modi) కుటుంబ సభ్యులం. ఆయనకు అండగా ఉంటాం. ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేశాం. మీ లాగా కుంభకోణాలు చేయలేదు. దాణా కుంభకోణం చేసిన దొంగ లాలు ప్రసాద్ యాదవ్ అని’ స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. గత పదేళ్ల యూపీఏ పాలన - పదేళ్ల మోదీ (PM Modi) హయాంలో జరిగిన అభివృద్ధిని చూడాలని రాహుల్ గాంధీని కోరారు. పదేళ్లలో నిరుపేదలు, మహిళలు, రైతుల జీవితాల్లో సమూల మార్పులు జరిగాయని వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 11:15 AM

Advertising
Advertising