Kejriwal: జైలు నుంచే జోరు.. రెండో ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్..
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:08 PM
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. తదుపరి చర్యలకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ రెండో ఆర్డర్స్ జారీ చేయడం దేశ రాజకీయాలను మరింత వేడి పెంచేసింది. మొదటి ఆర్డర్‌లో నీరు, మురుగు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించాలని మంత్రి అతిశీను కేజ్రీవాల్ ఆదేశించగా.. రెండో ఆర్డర్స్ లో మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులలో మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కొరతను పరిష్కరించాలని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన దిల్లీ ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని మంత్రి భరద్వాజ్ అన్నారు. మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులలో మందులు అందుబాటులో లేవని తెలుసుకున్న సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. తనను జైలులో పెట్టినా దిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ఆర్డర్స్ ఇచ్చారని మంత్రి భరద్వాజ్ స్పష్టం చేశారు.
Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..
"దిల్లీలోని పదివేల కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రుల మందులపై ఆధారపడి ఉన్నాయి. కొంతమందికి బీపీ, షుగర్ వంటి జీవితకాల మందులు అవసరం. చాలా మంది రోగులు నిర్ణీత వ్యవధిలో రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. చాలా మొహల్లా క్లినిక్‌లలో ఉచిత పరీక్షలకు అంతరాయం కలుగుతోంది. ఈ ఆదేశాలతో నాపై బాధ్యత మరింత పెరిగింది. పరిస్థితిని పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన పని చేస్తాను."
- సౌరభ్ భరద్వాజ్, దిల్లీ మంత్రి
Varun Gandhi: వరుణ్ గాంధీకి మొండి చేయి.. మేనకా గాంధీకి అగ్రతాంబూలం..
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 12:20 PM