Congress: రాజ్యాంగానికి పెనుముప్పు
ABN, Publish Date - Dec 27 , 2024 | 05:29 AM
ఇంతవరకు ఎదురుకాని పెనుముప్పును భారత రాజ్యాంగం ఎదుర్కొంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల దశాబ్దాల ప్రాజెక్టు అని ధ్వజమెత్తింది.
ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రాజెక్టే అది..
అమిత్‌షా రాజీనామా చేయాల్సిందే
కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ రాజకీయ తీర్మానం
బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశం
జాతికి క్షమాపణ చెప్పాల్సిందే
గాంధీజీ వారసత్వాన్ని పరిరక్షిస్తాం
ఖర్గే, రాహుల్, ఏఐసీసీ నేతలంతా హాజరు
గాంధీ చిత్రపటాలతో వేదిక వద్దకు ర్యాలీ
పార్టీలో కొత్త తరానికి చాన్సివ్వాలి: ఖర్గే
బెంగళూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇంతవరకు ఎదురుకాని పెనుముప్పును భారత రాజ్యాంగం ఎదుర్కొంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల దశాబ్దాల ప్రాజెక్టు అని ధ్వజమెత్తింది. సంఘ్ ప్రోద్బలంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను కించపరిచారని ఆరోపించింది. ఆయన కచ్చితంగా రాజీనామా చేసి తీరాలని స్పష్టం చేసింది. జాతికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. గాంధీజీపై తీవ్రంగా పోరాడిన సైద్ధాంతిక శక్తి (ఆర్‌ఎ్‌సఎస్).. ఆయన వారసత్వాన్ని టార్గెట్ చేసిందని ధ్వజమెత్తింది. ఆ వారసత్వాన్ని కాపాడేందుకు, పరిరక్షించడానికి, వ్యాప్తి చేసేందుకు పునరంకితమవుతామని సంకల్పం తీసుకుంది. రాజ్యాంగంపై దాడి, ధరల పెరుగుదల, అవినీతికి వ్యతిరేకంగా 13 నెలలపాటు పాదయాత్రలు సహా వివిధ రూపాల్లో ఉద్యమించేందుకు కార్యాచరణను ప్రకటించింది. ‘నవ సత్యాగ్రహ బైఠక్’ పేరిట వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావి(బెల్గాం)లో ప్రారంభమైంది. 1924లో బెల్గాంలోనే జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో మహాత్మాగాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.
ఇది జరిగి వందేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడిక్కడ చరిత్రాత్మక భేటీని నిర్వహిస్తున్నారు. తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులు గాంధీజీ చిత్రపటాలు చేతబట్టి సమావేశ ప్రాంగణం ‘వీరసౌధ’కు ప్రదర్శనగా తరలివచ్చారు. పార్టీ పతాకాన్ని ఎగురవేసి.. బైఠక్‌ను ఖర్గే ప్రారంభించారు. కొత్త ఏడాది 2025లో పార్టీ అనుసరించాల్సిన రోడ్‌మ్యా్‌పపై విస్తృతంగా చర్చించారు. రాజకీయ, ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనడానికి కార్యాచరణను కూడా రూపొందించారు. సమావేశంలో ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. అంబేడ్కర్‌కు జరిగిన అవమానం తాలూకు తప్పును అంగీకరించడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని ఆక్షేపించారు. రాజ్యాంగ రూపశిల్పిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని మండిప డ్డారు. బాబాసాహెబ్ గౌరవం కోసం కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ‘భారత్ అనే భావనను పార్టీకి అనుసంధానిస్తాం. సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవారిని, కాంగ్రెస్ సిద్ధాంతాలపై విశ్వాసం ఉన్నవారిని, రాజ్యాంగంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నవారిని.. మనం ఎంచుకోవాలి. వారందరినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి.
సంస్థాగత బాధ్యతల్లో భాగస్వామ్యం కల్పించాలి. కష్టపడి పనిచేయడం ఒక్కటే చాలదు. సకాలంలో నిర్మాణాత్మక వ్యూహం, దిశానిర్దేశం అవసరం. కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక, నూతన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలి’ అని ఆయన నొక్కిచెప్పారు. కాంగ్రె్‌సకు సైద్ధాంతిక శక్తి, గాంధీ-నెహ్రూ, ఇతర గొప్ప నేతల వారసత్వం ఉన్నాయని.. నూతన సంకల్పం, కొత్త సందేశంతో బెళగావి నుంచి తిరిగి వస్తామని తెలిపారు. ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉన్నవారు మహాత్మాగాంధీ సత్యాగ్రహాన్నే ప్రశ్నిస్తున్నారని, అందుకే వర్కింగ్ కమిటీ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’ అని పేరుపెట్టామని చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు అసత్యాల తోడ్పాటుతో కాంగ్రె్‌సపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి బండారం బయటపెట్టి.. ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, పీసీసీ సభ్యులు, రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీసు బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
గాంధీ వారసత్వానికి ముప్పు.. సీడబ్ల్యూసీ భేటీకి సోనియా సందేశం
కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు, వారిని పెంచి పోషించిన సిద్ధాంతాలు, సంస్థల వల్ల మహాత్మాగాంఽధీ వారసత్వానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ఈ సంస్థలు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నడూ పోరాడలేదని బీజేపీ, ఆరెస్సె్‌సలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గాంధీని తీవ్రంగా వ్యతిరేకించారని, గాంధీ హత్యకు దారితీసేలా ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. పైగా గాంధీ హంతకులను కీర్తిస్తారని విరుచుకుపడ్డారు. బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా సందేశాన్ని చదివి వినిపించారు. స్ఫూర్తికి ఒక ప్రాథమిక వనరుగా ఉన్న మహాత్మాగాంధీ.. భవిష్యత్తులోనూ కొనసాగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం, ఆరెస్సె్‌సపై సోనియా విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న గాంఽధేయ సంస్థలపై దాడి చేస్తున్నారన్నారు. అందుకే బెళగావి సీడ్ల్యూసీ సమావేశాన్ని ‘నవ్ సతాగ్రహ బైఠక్’ అని పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు.
క్షీణ దశలో ప్రజాస్వామ్యం
రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ అంబేడ్కర్ ఎంతో శ్రద్ధచూపారని.. ఇబ్బందులు ఎదుర్కొన్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పేర్కొంది. పార్లమెంటులో అంబేడ్కర్‌ను అవమానించిన అవి.ుత్‌షా కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరో నెల రోజుల్లో (జనవరి 26) 75 ఏళ్లు కానుంది. ఈ తరుణంలో దురదృష్టవశాత్తూ రా జ్యాంగం ఇంతకుముందెన్నడూ లేనంత ముప్పును ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుండడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కార్యనిర్వాహక ఒత్తిడితో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిష్, మీడియా వంటి వ్యవస్థలను రాజకీయమయం చేశారు. పార్లమెంటును పక్కనపెట్టేశారు. అధికార పార్టీ సభ్యు లే సభ కార్యకలాపాలను అడ్డుకున్న చర్యను ఇటీవలి శీతాకాల సమావేశాల్లో చూశాం.
సమాఖ్య వ్యవస్థపై దాడి కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఒక దేశం-ఒకే ఎన్నిక బిల్లు తెచ్చారు. కీలకమైన ఎన్నికల డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులోకి రాకుండా నియంత్రించేందుకు 1961నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనలను కేం ద్రం సవరించడం.. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలకు మూలమైన పారదర్శకత, జవాబుదారీతనం అనే విలువలను నాశనం చేయడమే. దీనిని వర్కింగ్ కమిటీ తీవ్రం గా ఖండిస్తోంది. ఈ సవరణలను సుప్రీంకోర్టులో సవాల్ చేశాం. మహారాష్ట్ర, హ రియాణాల్లో ఎన్నికల నిర్వహణ తీరు ఎన్నికల ప్ర క్రియ సమగ్రతనే దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రాయోజిత మత, జాతి వి ద్వేషాలు పెచ్చరిల్లడం.. ము ఖ్యంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను 50ు సీలింగ్‌కు మించి పెంచాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి’ అని తీర్మానంలో పేర్కొన్నారు. గాంధీజీపైనా విడిగా తీర్మానం ఆమోదించారు.
Updated Date - Dec 27 , 2024 | 05:29 AM