Arvind Kejriwal: సీబీఐ అరెస్టుపై కేజ్రీ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:39 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. తాత్కాలిక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy) కేసులో సీబీఐ (CBI) తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు (Delhi High court) బుధవారంనాడు రిజర్వ్ చేసింది. తాత్కాలిక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సంగ్ తన వాదన వినిపిస్తూ, లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమే సుప్రీంకోర్టు 21 రోజుల తాత్కాలిక బెయిలు మంజూరు చేసినందున తమ సొంతానికి కేజ్రీవాల్ దానిని వాడుకోలేదని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోర్టు జూన్ 20న బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. దానిపై సహేతుక కారణాలతో ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. చిన్నపాటి అనుమానం వచ్చినా వ్యక్తులను అరెస్టు చేసే స్వేచ్ఛ సీబీఐకి ఉందని, ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సమయంలో కూడా సీబీఐ తగిన ఆధారాలున్నందునే అరెస్టు చేసిందని వాదించారు. విచారణ కోసం అరెస్టు చేయడాన్ని సీఆర్‌పీసీ అనుమతిస్తుందని, కేజ్రీవాల్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమైనందునే కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందని అన్నారు.
Suvendu సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
విచారణను ప్రభావితం చేసి, పక్కదారి పట్టించే సామర్ధ్యం కేజ్రీవాల్‌కు ఉందని నిరూపించేందుకు తగిన మెటీరియల్ సీబీఐ వద్ద ఉందని డీపీ సింగ్ వాదించారు. సీబీఐ దర్యాప్తు తుది దశలో ఉందని, సీఎంను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే సహేతుకమైన భయాలు తమకు ఉన్నాయని చెప్పారు.
జాప్యం ఎత్తుగడలు: సింఘ్వి
కాగా, సీబీఐ కేవలం సాధ్యమైనంత జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. సీఎం బెయిలుపై కోర్టు విచారణ జరపరాదనడానికి సీబీఐ ఒక్క కారణం కూడా చూపించలేకపోయిందని అన్నారు.
for Latest News and National News click here