Delhi water crisis: ముదిరిన నీటి సంక్షోభం.. సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన అతిషి
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:29 PM
ఢిల్లీ నీటి సంక్షోభంపై 'ఆప్' మంత్రి అతిషి శుక్రవారం మధ్యాహ్నం నిరవధిక 'సత్యాగ్రహ దీక్ష'ను ప్రారంభించారు. హర్యానా నుంచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన జలాలు రాకపోవడంతో దేశ రాజధాని నీటి సంక్షోభంలో చిక్కుకుందని, తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని రెండ్రోజుల క్రితం అతిషి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభంపై 'ఆప్' మంత్రి అతిషి (Atishi) శుక్రవారం మధ్యాహ్నం నిరవధిక 'సత్యాగ్రహ దీక్ష' (hunger strike)ను ప్రారంభించారు. హర్యానా నుంచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన జలాలు రాకపోవడంతో దేశ రాజధాని నీటి సంక్షోభం (Delhi Water crisis)లో చిక్కుకుందని, తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని రెండ్రోజుల క్రితం అతిషి లేఖ రాశారు. సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపతానని కూడా ఆమె ప్రకటించారు. హర్యానా నుంచి ప్రతిరోజూ 100 మిలియన్ గ్యాలన్ల నీరు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మధాహ్నం 12 గంటల ప్రాంతంలో సత్యాగ్రహ దీక్షకు దిగారు.
దీనికి ముందు, ఒక ట్వీట్‌లో ఢిల్లీ నీటి సంక్షోభ పరిష్కారానికి తాము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తమ వంతు జలాలను హర్యానా ప్రభుత్వం విడుదల చేయలేదంటూ అతిషి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆవేదన వ్యక్తం చేశారు. జాంగ్‌పురలోని భోగల్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు నిరాహార దీక్షలో కూర్చుకుంటున్నానని, హర్యానా నుంచి రావాల్సిన జలాలు వచ్చేంత వరకూ దీక్ష విరమించేది లేదని చెప్పారు. కాగా, దీక్షకు ముందు రాజ్‌ఘాట్ వద్దనున్న మహాత్మాగాంధీ సమాధి వద్ద ఆమె పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆమె వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి సునితా కేజ్రీవాల్, మంత్రి సంజయ్ సింగ్ తదితరులు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.
Read Latest Telangana News and National News