Share News

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:35 AM

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

న్యూఢిల్లీ/ఢాకా, ఆగస్టు 24: హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

ఈ ఘటన గురువారం సాయంత్రం ఉత్తర బెంగాల్‌లోని కుచ్‌బెహార్‌ సమీపంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పశువుల కంచె నిర్మాణాన్ని నిలిపివేశామని.. అక్టోబరులో ఢిల్లీలో జరిగే ఉభయ దళాల డైరెక్టర్‌ జనరల్స్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు.

సరిహద్దుల్లో పశువుల కంచె నిర్మాణానికి 2012లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. మరోవైపు శనివారం ఉదయం పొరపాటున బంగ్లాదేశ్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన ఐదుగురు పౌరులను తిరిగి అప్పగించడానికి బీజీబీ నిరాకరించింది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని సిల్హేట్‌ వద్ద భారత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షంషుద్దీన్‌ చౌదురి మాణిక్‌ను బీజీబీ అరెస్టు చేసింది.

Updated Date - Aug 25 , 2024 | 04:35 AM