Deve Gowda: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయ, మోదీ ఆదేశిస్తే బరిలోకి కుమారస్వామి..!
ABN , Publish Date - Jan 14 , 2024 | 08:02 AM
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తనకు 90 ఏళ్లు అని, వయస్సు పైబడినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
బెంగళూర్: మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ (Deve Gowda) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తనకు 90 ఏళ్లు అని, వయస్సు పైబడినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తానని మీడియా ప్రతినిధులకు స్పష్టంచేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) పోటీ చేస్తారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పోటీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పారు. ఊహాగానాలపై స్పందించనని వివరించారు. కుమారస్వామి పోటీ చేయాలని ప్రధాని మోదీ కోరితే ఆలోచిస్తామని వివరించారు. ప్రధాని మోదీ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. గత ఏడాది ఎన్డీఏలో జేడీఎస్ చేరిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో కుమారస్వామి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవీ దక్కుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్ సభ నుంచి మరోసారి బరిలోకి దిగుతారని దేవెగౌడ స్పష్టంచేశారు. ప్రధాని మోదీపై దేవెగౌడ ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తి, శ్రద్దలతో నిర్వహిస్తారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.