Congress: అవి జోడో యాత్రలు కావు.. తోడో యాత్రలు.. శివరాజ్ సింగ్ చౌహాన్..
ABN, Publish Date - Mar 18 , 2024 | 05:20 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలు కలిపేవి కాదని అవి విదదీసే ( తోడో ) యాత్రలు అని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలు కలిపేవి కాదని అవి విదదీసే ( తోడో ) యాత్రలు అని ఫైర్ అయ్యారు. ఈ యాత్రలు సాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ ఛోడో యాత్రలుగా మారాయని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. యాత్ర సాగినప్పుడల్లా కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా సీనియర్ నాయకులనూ వదులుకుందని, చాలా మంది కాంగ్రెస్ ను వీడారని వివరించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారనే చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి మహిళలకు మద్దతుగా కాంగ్రెస్ ఎందుకు ప్రకటన చేయలేదని శివరాజ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర ప్రకటనలు ఇస్తున్నారని ఇది భారత సంస్కృతిలో లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో నాయకత్వం లేనందున సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ఎందుకు పోటీ చేయడం లేదని విమర్శించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 18 , 2024 | 05:20 PM