Share News

Hero Darshan: హీరో దర్శన్‌కు వైద్య పరీక్షలు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:25 PM

రేణుకాస్వామి(Renukaswamy) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా బళ్లారి జైల్లో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్‌(Kannada movie hero Darshan)కు మంగళవారం రాత్రి విమ్స్‌ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్శన్‌ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు విమ్స్‌లో స్కానింగ్‌ పరీక్షలు చేశారు.

Hero Darshan: హీరో దర్శన్‌కు వైద్య పరీక్షలు..

బళ్లారి(బెంగళూరు): రేణుకాస్వామి(Renukaswamy) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా బళ్లారి జైల్లో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్‌(Kannada movie hero Darshan)కు మంగళవారం రాత్రి విమ్స్‌ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్శన్‌ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు విమ్స్‌లో స్కానింగ్‌ పరీక్షలు చేశారు. ఉదయం వేళ ఆసుపత్రికి తీసుకెళ్లితే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాత్రి తీసుకెళ్లారు. ఇంతకు మునుపే వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచించారు. గత కొంత కాలంగా నొప్పి మరింత ఎక్కువ కావడంతో ఆయనకు మంగళవారం రాత్రి పరీక్షలు చేశారు.

pandu1.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: Chennai: బంగాళాఖాతంలో తుఫాన్‌.. 5 రోజుల వర్షసూచన


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

Tungabhadra: బెంగ‘భద్ర’..! తుంగభద్ర జలాశయానికి ఉధృతంగా వరద నీరు

- క్రస్ట్‌గేట్లు తెరిచి నదికి మళ్లింపు

- క్రస్ట్‌గేట్ల భద్రతపై ఆందోళన

- ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు

బళ్లారి(బెంగళూరు): కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల రైతులకు జీవధారగా ఉన్న తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయానికి నీరు ఉధృతంగా చేరుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరుతుండడంతో క్రస్ట్‌గేట్లు తెరిచి నీటిని నదికి వదులుతున్నారు. రోజురోజుకూ నీటి ఉధృతి పెరుగుతుండడంతో డ్యాం అధికారులు ఆందోళన చెందుతున్నారు. క్రస్ట్‌గేట్లు ప్రమాదకరంగా ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని నిరంతరం పరిశీలిస్తున్నారు.

pandu2.jpg


ఆగస్టు 10న డ్యాంలో నీటి ఉధృతికి 18వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన విషయం విదితమే. డ్యాంగేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, ఇతర అధికారులు రంగంలోకి దిగి స్టాప్‌లాగ్‌ అమర్చారు. క్రస్ట్‌గేటు ప్రమాదంలో కొట్టుకుపోయిన నేపథ్యంలో తుంగభద్ర ప్రాంత రైతులు, ఆధికారులు అందోళన చెందారు. గత నెలరోజులుగా జలాశయానికి నీరు చేరుతూనే ఉంది. డ్యాం సామర్థ్యం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాం లెవెల్‌ 1631.92 అడుగులు ఉంది. డ్యాంలో ప్రస్తుతం 101.461 టీఎంసీలు నీరు ఉంది. మంగళవారం సాయంత్రానికి జలాశయానికి ఇన్‌ఫ్లో 1,12,136 క్యూసెక్కులు ఉండగా.. క్రస్ట్‌గేట్లు తెరిచి నదికి 1,01,628 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.


నది కింద భాగంలో ఉండే ప్రాంతాలను అప్రమత్తం చేశారు. తీరంలో ఉండే గ్రామాల ప్రజలు ఎవరూ నది వైపు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయానికి పై ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో భారీ స్థాయిలో వస్తుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకు ముందే నీటి ప్రాజెక్టుల గేట్లు తయారీ నిపుణులు మొత్తం 33 గేట్లు మార్చాలని సూచించారు. 70 ఏళ్ల క్రితం అమర్చిన గేట్లు కాలం చెల్లాయని హెచ్చరించారు. బోర్డు అధికారులు, బోర్డు కమిటీ కూడా గేట్ల మార్పుపై సీడబ్ల్యూసీకి నివేదిక ఇచ్చాయి. కానీ ఇంత వరకూ అనుమతి అందలేదు. ప్రస్తుతం డ్యాంలో నీరు నిండు కుండలా తొణికిసలాడుతోంది.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 12:25 PM