ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేరానికి తగ్గ శిక్ష పడుతోందా?

ABN, Publish Date - Nov 06 , 2024 | 02:52 AM

న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది..

  • సమీక్షించే యోచనలో కేంద్ర ప్రభుత్వం.. అవసరమైతే ఆ ‘తీర్పులు’ నిలుపుదల

  • బాలికలపై అత్యాచారం కేసుల్లో పెద్దగా విచారణ లేకుండానే మరణ శిక్షలు

  • ఓ కేసులో 30 నిమిషాల్లోనే విచారణ, తీర్పు.. మరోదాంట్లో అరెస్టు చేసిన 23 రోజుల్లో ఉరి

  • దీంతో 2021 తర్వాత నమోదైన పోక్సో కేసుల్లో తీర్పులన్నింటినీ సమీక్షించే యోచన

  • విధాన రూపకల్పనలో కేంద్ర న్యాయ శాఖ.. డిసెంబరులో సుప్రీంకోర్టుకు నివేదన

న్యూఢిల్లీ, నవంబరు 5: న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది.. చేసిన నేరం తీవ్రతతో సంబంధం లేకుండా న్యాయమూర్తులు అప్పుడప్పుడు ఏకపక్షంగా ఇస్తున్న తీర్పులు న్యాయవర్గాలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ తరహా తీర్పులను అవసరమైతే నిలుపుదల చేసేందుకు ఉన్న మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. దీనిపై వచ్చే డిసెంబరులో ఒక విస్పష్ట విధానాన్ని సుప్రీంకోర్టు ఎదుట కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించనుంది. బిహార్‌లో ఓ కోర్టు బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని కేవలం 30 నిమిషాలు విచారించి మరణశిక్ష విధించింది. ఈ వ్యవహారం 2022లో తీవ్ర కలకలం రేపింది. ప్రజాగ్రహానికి కారణమైన ఈ కేసులో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆ తీర్పును సవరించింది. న్యాయమూర్తిని ట్రైనింగ్‌కు పంపాలని అప్పట్లో ఆదేశాలు కూడా జారీచేసింది.

ఇదే అంశాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు.. దీనిపై తన నిర్ణయం తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ఈ ఏడాది మే నెలలో కోరింది. ఈ మేరకు నిర్దిష్ట విధానంతో కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టు ముందుకు వెళ్లనుంది. ఏకపక్ష, నిర్హేతుక తీర్పుల పద్ధతిని నిరోధించే లక్ష్యంతో, శిక్షాస్మృతిలోని నిబంధనలను సవరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దిగువ కోర్టులకు చిన్నచిన్న శిక్షలు విధించే అధికారం మాత్రమే ఉండాలని ప్రతిపాదిత విధానంలో కేంద్రం సూచించినట్టు తెలిసింది.


పోక్సో కేసులపై దిగువ కోర్టులు తీవ్రంగా స్పందిస్తున్న తీరును కేంద్ర న్యాయశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. మధ్య భారతంలోని ఓ న్యాయస్థానం పోక్సో కేసులో నిందితుడికి అరెస్టు అయిన 23 రోజుల్లోనే మరణశిక్ష విధించింది. నిందితుడిని ఉరితీయాలంటూ జరిగిన వీధి పోరాటాల ఒత్తిడికి ఆ జడ్జీ గురయి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2021నుంచి పోక్సో కింద నమోదైన కేసుల్లో తీర్పులను ప్రతిపాదిత విధానం కింద చేపట్టే న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకురానున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 02:52 AM