Share News

Kangana Ranaut: కంగనాకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:15 AM

హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.

Kangana Ranaut: కంగనాకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హురాలిపై ప్రకటించాలని లాయక్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ జ్యోత్స్నా రేవాల్‌.. కంగనాకు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో కంగనా విజయం సాధించారు.


సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని లాయక్ ఆరోపించారు.

ఈయన గతంలో అటవీ శాఖలో పని చేసేశారు. పదవీ విరమణ తరువాత రిటర్నింగ్ అధికారి(మండి డిప్యూటీ కమిషనర్)కి నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్‌మెంట్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. విద్యుత్‌, నీరు, టెలిఫోన్‌ శాఖల నుంచి ‘నో డ్యూ సర్టిఫికేట్‌’ సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇవ్వగా, రిటర్నింగ్‌ అధికారి వాటిని ఆమోదించలేదని.. పైగా నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారన్నారు.


తన నామినేషన్‌ని స్వీకరించి ఉంటే విజయం సాధించేవాడినని, వివరాలను అన్ని సమర్పించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని పేర్కొన్నారు ఆయన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగస్టు 21లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కంగనాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 11:46 AM