ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: రాయ్ బరేలి పిలుస్తోంది..పోటీ చేయు ప్రియాంక, వెలిసిన పోస్టర్లు

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:30 PM

రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పోస్టర్లు వెలిశాయి. రావమ్మా ప్రియాంక.. ఇక్కడి నుంచి పోటీ చేయండని పోస్టర్ల మీద రాసి ఉంది. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాలని కూడా పోస్టర్ల మీద ఉంది.

రాయ్ బరేలి: కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలి (Rae Bareli), ఇక్కడి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రాతినిధ్యం వహించారు. అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని సోనియా (Sonia) ప్రకటన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగేది ఎవరు..? ఈ క్రమంలో అక్కడ పోస్టర్లు వెలిశాయి.

రావమ్మా..

రాయ్ బరేలితోపాటు అమేథి కాంగ్రెస్ కంచుకోట. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. రెండో స్థానం కేరళ వాయనాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగే అవకాశం ఉంది. రాయ్ బరేలిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. రాయ్ బరేలి నుంచి ప్రియాంక (Priyanka Gandhi) పోటీ చేయాలని అక్కడ పోస్టర్లు వెలిశాయి. ‘రాయ్ బరేలి పిలుస్తోంది.. ప్రియాంక గాంధీ రండి’ అని పోస్టర్ల మీద రాశారు. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాలని పోస్టర్ల మీద రాశారు. గాంధీలు ప్రాతినిథ్యం వహించిన రాయ్ బరేలిలో గాంధీ వారసురాలు పోటీ చేయాలని ఆ పోస్టర్లలో రాసి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 01:30 PM

Advertising
Advertising