Share News

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

ABN , Publish Date - Nov 16 , 2024 | 07:29 PM

ఆందోళనకారులు ఇద్దరు మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది. జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది.

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. జిరిబం(Jiribam) జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు శవాలై తేలడంతో ఇంఫాల్‌లో జనాగ్రహం పెల్లుబికింది. ఆందోళనకారులు ఇద్దరు మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది. జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, థౌబల్, కాక్‌చింగ్, కాంగ్పోక్పి, చురాచాంద్‌పూర్‌లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డాటా సర్వీసులను నిలిపివేసింది.

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు


ఆందోళనకారులు లాంఫెల్ సనకీథేల్ ప్రాంతంలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసం వద్ద, ఇంఫాల్ వెస్ట్‌ జిల్లాలోని సగోల్‌బండ్ ఏరియాలోని బీజేపీ లెజిస్లేటర్ ఆర్ ఇమో ఇంటివద్ద నిరసనలుకు దిగినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు అమాయక ప్రజలను బలిగొన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు వాహనాలను ధ్వసం చేయడంతో పాటు కొన్నింటికి నిప్పుపెట్టారు. జిరిబం జిల్లా నుంచి అపహరణకు గురైన ఆరుగురిలో ముగ్గురి మృతదేహాలు మణిపూర్-అసోం సరిహద్దు వెంబడి జిరి-బరాక్ నదీ సంగమం సమీపంలో శుక్రవారం రాత్రి కనిపించాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నట్టు శనివారం ఉదయం గుర్తించారు. కుకీ మిలిటెంట్లు మహిళను, పిల్లలను బందీలుగా పట్టుకుని కాల్చిచంపారని అనుమానిస్తున్నారు.


గత ఏడాది మే నుంచి జాతుల ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల కాలంలో తిరిగి సాయుధ మిలిటెంట్లు దాడులకు దిగుతుండటం, బందీలుగా పట్టుకుని కాల్చిచంపుతుండటం వంటి ఘటనలతో పరిస్థితి విషమిస్తున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.


ఇవి కూడా చదవండి:

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..

Ajit Pawar: 175 సీట్లు గెలుస్తాం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 07:29 PM