ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రాహుల్ గాంధీ.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్..

ABN, Publish Date - Jun 08 , 2024 | 03:48 PM

Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు.

Rahul Gandhi

Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు. శనివారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయ్యింది. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.


సిడబ్ల్యూసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై, ఎన్నికల ఫలితాలపై చర్చించామన్నారు. సీబీఐ, ఈడీ సంస్థలతో కాంగ్రెస్ నేతలను బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారని.. ఎగ్జిట్ పోల్స్‌పై పోరాటం చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.


ఇండియా కూటమి ఎజెండాను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరించారని కేసీ విమర్శించారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషిని సీడబ్ల్యూసీ సమావేశంలో అభినందించామన్నారు. ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ అబద్దాలు చెప్పారని విమర్శించారు కేసీ వేణుగోపాల్. పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలిపింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ చేసిన రెండు యాత్రలు కాంగ్రెస్ గెలుపునకు కలిసి వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమతో కలిసి వచ్చిన కూటమి నేతలకు సైతం కాంగ్రెస్ ధన్యవాదాలు తెలిపింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కాంగ్రెస్ ముందుంటుందని కేసీ వేణుగోపాల్ ఉద్ఘాటించారు.

For More National News and Telugu News..

Read more!

Updated Date - Jun 08 , 2024 | 06:27 PM

Advertising
Advertising