ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: ఇద్దరు మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:59 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ (BJP) ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు. ఆదివారం నాడు ముంబైలో (Mumbai) జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫడ్నవీస్ (Fadnavis) పాల్గొని మాట్లాడారు.

ప్రకటన కాదది

మహారాష్ట్ర 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలను ఫడ్నవీస్ (Fadnavis) గుర్తుచేశారు. ‘మళ్లీ అధికారం చేపడతామని ఫడ్నవీస్ ఆ సమయంలో అన్నారు. ఆ వ్యాఖ్యలు ఒక ప్రకటన మాత్రం కాదు. మహారాష్ట్ర రూపు రేఖలు మార్చడానికి తిరిగి అధికారం చేపట్టాలని అనుకున్నా. మళ్లీ అధికారం చేపట్టేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టింది. రెండు పార్టీల్లో చీలిక ద్వారా అధికారం చేపట్టడం సాధ్యం అయ్యింది. దాంతో తనకు ఇద్దరు మంచి మిత్రులు దొరికారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు ప్రాణ స్నేహితులు లభించారు అని’ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.

స్నేహితులు

శివసేన అధినేత ఉద్దవ్ థాకరే మీద ఏక్ నాథ్ షిండే 2022 జూన్‌లో తిరుగుబాటు చేశారు. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో శివసేన చీలింది. షిండే ముఖ్యమంత్రి పదవీ చేపట్టగా, ఫడ్నవీస్ (Fadnavis) డిప్యూటీ సీఎం పదవీ చేపట్టారు. షిండే పార్టీని అసలైన శివసేన పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. గత ఏడాది జూలై నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. రెండు పార్టీల చీలికతో తనకు ఇద్దరు మంచి స్నేహితులు లభించారని ఫడ్నవీస్ చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 11:59 AM

Advertising
Advertising