Share News

Bansuri Swaraj: స్వాతిపై దాడి.. కేజ్రీవాల్ స్పందించక పోవడం సిగ్గుచేటు

ABN , Publish Date - May 14 , 2024 | 04:11 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.

Bansuri Swaraj: స్వాతిపై దాడి.. కేజ్రీవాల్ స్పందించక పోవడం సిగ్గుచేటు
Bansuri Swaraj

న్యూఢిల్లీ, మే 14: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె, ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ.. స్వాతి మలివాల్‌పై దాడికి ఖండిస్తున్నామన్నారు.

AP Election 2024: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

కేజ్రీవాల్ సమక్షంలోనే ఆ పార్టీ మహిళా ఎంపీపై సీఎం కార్యాలయం సిబ్బంది దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. పార్టీలోని ఓ మహిళకే రక్షణ లేదని.. అలాంటిది ఢిల్లీలోని మహిళలను ఎలా రక్షిస్తారంటూ సీఎం కేజ్రీవాల్‌ను ఈ సందర్బంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.


Thief At Flight : విమాన ప్రయాణికులే టార్గెట్..!

జూన్ 2వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దీంతో ఆయన కుటుంబంలోని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారన్నారు. దీంతో ఆ పార్టీలో టెన్షన్ మరింత పెరుగుతుందని తెలిపారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో అంత మంచి జరుగుతుందని చెప్పలేమని చెప్పారు.

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

సోమవారం సీఎం కేజ్రీవాల్ కార్యాలయ సిబ్బంది తనపై దాడి చేశారని ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఆ క్రమంలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లారు. కానీ ఫిర్యాదు చేయకుండానే స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.

Read National News And Telugu News

Updated Date - May 14 , 2024 | 04:11 PM