Elections 2024: సగం కంప్లీట్.. ఆధిక్యం ఎవరిది..?
ABN, Publish Date - May 09 , 2024 | 12:46 PM
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఈ మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితేనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, రానున్న నాలుగు విడతల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగతా చోట్ల ఇండియా కూటమికి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..
ఇండియాకు ప్లస్ ఇవే..!
మొదటి మూడు విడతల్లోనే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అన్ని స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 87 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి పక్షాలు ఎక్కువ సీట్లు గెలవగా.. ఎన్డీయే కూటమి కర్ణాటకలో మాత్రమే ప్రభావం చూపించింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని మొత్తం స్థానాలతో పాటు మహారాష్ట్రలో 48 స్థానాలకు గానూ 24 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 112 స్థానాల్లో కాంగ్రెస్ ఇండియా కూటమి కనీసం వంద స్థానాలకుపైగా గెలుచుకోగలుగుతుందని అంచనా వేస్తున్నారు. కేరళ, తమిళనాడులో కలిపి 59 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మూడు విడతల్లో కలిపి దాదాపు 150 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఇండియా కూటమి మరో నాలుగు విడతల్లో జరగనున్న 260 స్థానాల్లో 100 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటే అధికారంలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
Supreme Court: విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దు.. పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీం సూచన
ఎన్డీయే ధీమా.
మొదటి మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. అదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, యూపీలో బీజేపీ బలంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 127 స్థానాలు ఉన్నాయి. వీటిలో వందకు పైగా గెలుస్తామని ఎన్డీయే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమిళనాడులో ఎన్డీయే కూటమి 5 నుంచి 10 సీట్లు సాధిస్తుందని, కర్ణాటకలో 15కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఓ 10 సీట్లు గెలిచినా.. 130 నుంచి 140 వరకు గెలుస్తామనే ధీమాలో ఎన్డీయే కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత నాలుగు విడతల్లో జరగనున్న 260 స్థానాల్లో కనీసం 150 స్థానాల్లో గెలిచినా అధికారానికి ఢోకా లేదని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
తరువాతి నాలుగు విడతలే కీలకం..
నాలుగు, ఐదు, ఆరు, ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనే 54 స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలు ఉండగా.. ఇక్కడ టీడీపీతో కలిసి బీజేపీ పోటీచేస్తోంది. ఎన్డీయే కూటమికి ఏపీలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండగా డబుల్ డిజిట్ సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. కనీసం 6 నుంచి 7 స్థానాలు తప్పకుండా సాధిస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం తక్కువలో తక్కువ తమకు 270 నుంచి 300 ఈజీగా వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎవరి లెక్కలు ఒప్పు.. ఎవరి లెక్కలు తప్పు అనేది జూన్4న తేలిపోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - May 09 , 2024 | 03:10 PM