ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మహిళల రక్షణను దీదీ ప్రభుత్వం గాలికొదిలేసింది: ప్రధాని మోదీ

ABN, Publish Date - Mar 06 , 2024 | 02:24 PM

తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సభకు భారీగా మహిళలు వచ్చారు.

బరాసత్: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ (PM Modi) పశ్చిమ బెంగాల్‌ వచ్చారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సభకు భారీగా మహిళలు వచ్చారు. వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. టీఎంసీ ప్రభుత్వంలో ఎన్నడూ మహిళలకు భద్రత లేదని విమర్శించారు. సందేశ్ ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరుల ఆగడాలు శృతి మించాయి. బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడం, వ్యతిరేకించిన మహిళలను లైంగికంగా వేధించేవారు. షేక్ షాజహాన్ అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ పర్యటించింది. ఇక్కడ ఏం జరిగిందనే అంశంపై నిజ నిర్ధారణ నివేదిక రూపొంచింది. షాజహాన్, అతని అనుచరులు మహిళలను వేధించారని పేర్కొంది.

ఇది కూడా చదవండి: PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ

‘నారీ శక్తిని వికసిత్ భారత్ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎలా మారుస్తుందో చెప్పడానికి బరాసత్‌లో జరిగిన కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. జనవరి 9వ తేదీన దేశవ్యాప్తంగా బీజేపీ శక్తివందన్ కార్యక్రమం చేపట్టింది. లక్షలాది స్వయం సహాయక సంఘాలతో చర్చలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం భారీ కార్యక్రమం నిర్వహించాం. కోల్ కతాలో వివిధ అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశా. కోల్ కతా మెట్రో, పుణె మెట్రో, కొచ్చి మెట్రో, ఆగ్రా మెట్రో నమో భారత్ రైళ్లకు అనుసంధానించబడ్డ కొత్త మార్గాలు విస్తరించాయి. 2014కి ముందు కోల్ కతా మెట్రో 28 కిలోమటర్లు మాత్ర ఉండేది. గత పదేళ్లలో మరో 31 కిలోమీటర్ల మార్గం అనుసంధానించాం. దేశ ప్రజా రవాణాను ఆధునీకరించాం అని’ ప్రధాని మోదీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ

‘టీఎంసీ ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు రక్షణ కల్పించదు. లైంగిక దాడి, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. జీవిత ఖైదు విధించాలని నిర్ణయం తీసుకుంది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు మహిళా సహాయాన్ని ఏర్పాటు చేశాం. టీఎంసీ ప్రభుత్వం అలా చేయలేదు. మహిళల సంక్షేమం కోసం టీఎంసీ ప్రభుత్వం ఎన్నటికీ పనిచేయలేదు అని’ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ

Updated Date - Mar 06 , 2024 | 02:24 PM

Advertising
Advertising