Share News

Teeth Health : దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:44 PM

తెల్లటి దంతాలు కావాలంటే కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోటిలో వేసుకుని పుక్కిలి పట్టాలి. ఇది దంతాలను, శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది.

Teeth Health : దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!
teeth Health

తెల్లని పలువరుస (Teeth Health) ముఖానికి అందాన్నిస్తుంది. అందమైన చిరునవ్వుకు అసలు కారణం తెల్లగా మెరిసే దంతాలే. దంతాలు చక్కని ఆకృతిలో ఉండి తెల్లగా మెరుస్తుంటే ఎదురుగా మాట్లాడుతున్న వాళ్ళ చూపు పళ్ల మీదకు వస్తుంది. అబ్బ భలే నవ్వు అనుకోక మానరు. నవ్వే స్వచ్ఛత పళ్ళ అందాన్ని బట్టే వస్తుంది. ఇక అలవాట్లతో దంతాలు తెలుపు రంగును పోగొట్టుకోవడం, సరైన శుభ్రత లేకపోవడం కూడా దంతాల అందాన్ని పాడు చేసే విషయమే. వేల రూపాయలు ఖర్చు చేస్తే కానీ అందం తిరిగి రాదు. తెల్లని దంతాలను పొందాలంటే.. సహజమైన నివారణలతో దంతాల అందాన్ని పెంచాలంటే ఇలా చేయవచ్చు.

టూత్‌పేస్ట్‌లో(Toothpaste) ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది మంచి నోటి పరిశుభ్రతను ఉప్పు ఒక రాపిడి ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల దంతాల నుండి ఉపరితల మరకలను తొలగించి, తెల్లగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. ఉప్పుతో రోజూ ఒకటి, రెండు నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దాలి. పళ్ళ మీద ఉపయోగించే పేస్ట్, పళ్ళపొడి ఇలా ఏదైనా ఒత్తిడితో తోమకూడదు. సున్నితంగా బ్రష్ చేయాలి. ఎనామిల్ పోయి చిగుళ్లు దెబ్బతింటాయి. నోటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

తెల్లటి దంతాలు కావాలంటే కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోటిలో వేసుకుని పుక్కిలి పట్టాలి. ఇది దంతాలను, శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. కావిటీస్ వల్ల వచ్చే దంతక్షయం తగ్గుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: శివుడికి చేసే అభిషేకాలతో ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా..!

శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటి.. ! అసలు ఎందుకు చేయాలి.


యాపిల్ సైడర్ వెనిగర్ నోటి పరిశుభ్రతను మెరుగుపరచడానికి దంతాలను తెల్లగా మార్చడంలో మౌత్ వాష్ ఉపయోగించాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి పుక్కిలి పడితే ఇది దంతాలపై ఉన్న మరకలను తగ్గిస్తుంది. వెనిగర్ ఆమ్ల స్వభావం అధికంగా ఉంటే దంతాల ఎనామిల్ క్షీణిస్తుంది. కాబట్టి నీటిలో కలిపి వాడాలి. దీనిని రోజూ మౌత్ వాష్ గా ఉపోయోగించడం దంతాలకు మంచిది.

పూర్వం రోజుల్లో బొగ్గుతో దంతాలను శుభ్రం చేసుకునేవారు. ఇది దంతాలకు శక్తిని ఇచ్చేది. బొగ్గు రాపిడితో పళ్లు అందంగా తెల్లగా మెరిసేవి. పైగా బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అయితే మరీ మితిమీరి ఉపయోగిస్తే మాత్రం ఎనామిల్ దెబ్బతింటుంది.

ఇది కూడా చదవండి: బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!

బేకింగ్ సోడాతో పేస్ట్ గా చేసి దంతాలను శుభ్రం చేయడం అలవాటైన పనే. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది. బేకింగ్ సోడా పేస్ట్ మాదిరిగా చేసి దంతాలను సున్నితంగా 1 నుంచి 2 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలీన్ స్వభావం నోటిలోని PH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహకరిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 08 , 2024 | 04:44 PM