Share News

Brass Utensils : పాత రాగి, ఇత్తడి పాత్రలను ఈజీగా క్లీన్ చేయాలంటే..!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:16 PM

పాత, మురికిగా ఉన్న ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ఒక తెలివైన మార్గం ఏమిటంటే పిండి, వెనిగర్ సమాన భాగాలుగా కలపడం ఈపేస్ట్ తయారు చేసి, ఇత్తడి పాత్రలకు అప్లై చేసి 1-2 గంటలు అలాగే ఉండనివ్వండి.

Brass Utensils : పాత రాగి, ఇత్తడి పాత్రలను ఈజీగా క్లీన్ చేయాలంటే..!
Brass Utensils

ఏవైనా పూజలు, పండుగలు, ప్రత్యేక దినాలు వస్తున్నాయంటే ఇక ఇంట్లో దైవారాధనకు ఉపయోగించే పూజా సామాన్లు (brass utensils), పెద్ద పెద్ద బిందులు, చంబులు అన్నీ తీసి కడగాలనుకుంటాం. ఇత్తడి, రాగి వస్తువులు శుభ్రం చేయడం అనేది విపరీతమైన కష్టంతో కూడూకున్న పని. అయితే వీటిని శుభ్రం చేసేందుకు చింతపండు, ఇసుక, నిమ్మకాయ వాడేవాళ్ళు కొందరైతే.. ఇంకొందరు ఇప్పటి రోజుల్లో వస్తున్న క్లీనింగ్ పౌడర్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే వీటితో శుభ్రపరచడం కాస్త టైం టేకింగ్ పనే.. వీటికి పట్టే సమయాన్ని తగ్గించాలంటే మాత్రం కొత్త టెక్నిక్స్ పాటించాల్సిందే. ముఖ్యంగా...

ఇంట్లో పాత వస్తువులను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. సాధారణంగా వీటిని క్లీన్ చేయడానికి నిమ్మ, ఉప్పు, స్క్రబ్, వెనిగర్, బేకింగ్ సోడా, కెచప్ ఇలాంటివి వాడుతుంటాం. పాత ఇత్తడి వస్తువులకు మెరుగు తేవాలంటే..

దీనికోసం నిమ్మరసం, ఉప్పు, డిష్ వాష్ మూడింటినీ కలిపి ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడం వల్ల మంచి షైన్ వస్తుంది. ఈ పదార్ధాలు కలిపిన మిశ్రమాన్ని పదినిమిషాల పాటు పాత్రలపై రుద్ది ఉంచి తర్వాత శుభ్రం చేయడం వల్ల మకిలి అంతా పోయి మంచి రంగు వస్తుంది.

వెనిగర్, బేకింగ్ సోడా..

ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి మరొక సులభమైన మార్గం వెనిగర్, బేకింగ్ సోడా సమాన భాగాలుగా తీసుకుని పేస్ట్‌లా చేసి దీనిని ఇత్తడి వస్తువులపై పూయడం వల్ల కెమికల్ రియాక్షన్ టార్నిష్‌ని తొలగించి 10- 15 నిమిషాల్లో శుభ్రం చేయాలి. ఇప్పుడు పూర్తిగా తళతళలాడతాయి.

ఇది కూడా చదవండి: ఈ చేప పిల్లల్ని తన నోటిలో ఎందుకు దాస్తుందో తెలుసా...!


టొమాటో కెచప్ పోలిష్

ఇత్తడి పాత్రలకు టొమాటో కెచప్‌ను నేరుగా వేసి రుద్ది,. మెత్తని స్పాంజ్ ఉపయోగించి కెచప్‌ను రుద్దండి. కెచప్‌ను 10-15 నిమిషాలు ఉంచి, కడిగి ఆరనివ్వండి.

పిండి, వెనిగర్ పేస్ట్

పాత, మురికిగా ఉన్న ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ఒక తెలివైన మార్గం ఏమిటంటే పిండి, వెనిగర్ సమాన భాగాలుగా కలపడం ఈపేస్ట్ తయారు చేసి, ఇత్తడి పాత్రలకు అప్లై చేసి 1-2 గంటలు అలాగే ఉండనివ్వండి. ఇత్తడిపై పేస్ట్‌ను నీటితో కాక వస్త్రాన్ని ఉపయోగించండి, పాత్రలు మెరుస్తూ కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

నిమ్మరసం, బేకింగ్ సోడా..

సమాన భాగాలుగా నిమ్మరసం, బేకింగ్ సోడా తీసుకుని, దీనితో ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడం వల్ల మంచి రంగుతో మెరుస్తాయి.

ఆలీవ్ ఆయిల్, వెనిగర్ పోలిష్..

స్పే బాటిల్‌లో సమాన భాగాలుగా ఆలివ్ ఆయిల్, వెనిగర్ తీసుకోవాలి. వెనిగర్ మచ్చలను తొలగించడంలో ముందుంటుంది. పాత్రలు మెరిసేలా చేయడంలోనూ వెనిగర్ పనిచేస్తుంది.

Updated Date - Mar 18 , 2024 | 03:16 PM