Share News

Ashada masam : ఆషాఢానికి అంత ప్రత్యేకత ఎందుకు? ఈ మాసంలో ఆ ఆకుకూరలనే ఎందుకు తింటారు..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:31 PM

వర్షాకాలంలో లేతగా చిగుళ్ళు కమ్మని రుచిగా ఉంటాయి. శరీరానికి వేడి చేసినా పెద్దగా ఇబ్బంది కలకదు. మునగాకులోని విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Ashada masam : ఆషాఢానికి అంత ప్రత్యేకత ఎందుకు? ఈ మాసంలో ఆ ఆకుకూరలనే ఎందుకు తింటారు..!
Ashada masam

ఆషాఢం మన తెలుగు సాంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆషాడమాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల మధ్య సమీపంలోకి వచ్చే నెలగా పరిగణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి, సూర్యూడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. హిందూ పూజలు, పునస్కారాల్లో ముఖ్యంగా ఈ మాసంలో జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. అలాగే దేవశయని ఏకాదశి, వారాహి నవరాత్రులు, కర్కాటక సంక్రాంతి ఈ మాసం ప్రత్యేక పర్వదినాలు. పురాణాల ప్రకారం ఈ మాసంలో శ్రీ మహా విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కనుక ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలను జరపరు. ఈ ప్రత్యేకమాసంలో జరిగే ముఖ్యంగా కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

ఆషాఢం వ్యావసాయానికి ముఖ్యమైన మాసం. అలాగే ఆడవారు చేతులకు గోరింటాకును పెట్టుకుంటారు. ఈ మాసంలో ఒక్కసారైనా ఎర్రగా పండే గోరింటాకుతో ఆడవారి చేతులు అందంగా ముస్తాబు అవుతాయి. అలాగే ఆషాఢంలో ముఖ్యంగా మునగకాయలు, మునగాకు తింటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా చేస్తుందని విరివిగా తింటూ ఉంటారు. వర్షాకాలంలో లేతగా చిగుళ్ళు కమ్మని రుచిగా ఉంటాయి. శరీరానికి వేడి చేసినా పెద్దగా ఇబ్బంది కలకదు. మునగాకులోని విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శీరీరానికి అనేక విధాలుగా మునగారు మేలు చేస్తుంది.

Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!

గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు.

వేసవికాలం వెళ్ళి వర్షాలు పడే సమయం ఇది. ముఖ్యంగా ఈ కాలంలో వాతావరణం చెమ్మగా ఉంటుంది. దీనితో అనేక ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక గోరింటాకును పెట్టుకుంటారు. ఇది శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.


ఆకుకూరల మాసం..

చిన్నగా చినుకులు పడగానే మొలకెత్తే చాలా రకాల మొక్కల్లో మనకు తెలిసినవి, ఆరోగ్యాన్నిచ్చేవి అనేకం. కొన్ని రకాల మొక్కలతో ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో ఈ మాసంలో ప్రత్యేకంగా కోరి తెచ్చుకుని తినే ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇవి సీజన్ ప్రకారం మాత్రమే లభ్యం అవుతూ ఉంటాయి. ఈ ఆకు కూరలను సేకరించడం కూడా కాస్త కష్టమే. వానలు పడ్డాకా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే దొరికే కొన్ని రకాల ఆకుకూరలు ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.

Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!

వీటికోసం గిరిజనలు పోటీపడి మరీ వెతుకుతారు. కోసి తెచ్చి శుభ్రం చేసుకుని వండుకుని తింటారు. కలగంటి, బొమ్మ తట్టెడు, కుప్పకూర లాంటి ఆకు కూరలు ఈ ఆషాఢంలోనే దొరుకుతాయి. చాలా వరకూ పెరళ్లలో మొలుస్తాయి. లేదా పొలాల గట్లమీద దొరుకుతాయి. ఇలా సీజన్ వారీగా దొరికే పండ్లు, కూరలను తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు గురి కాకుండా ఉంటామని నమ్ముతారు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 06 , 2024 | 04:31 PM