Share News

Viral Video: ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటున్న వ్యక్తి.. సమీపానికి వెళ్లిన యువతి.. గ్యాలరీలో చూడగా..

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:36 PM

ఓ అంకుల్ చేతిలో ఫోన్ పట్టుకుని ఫొటోలు తీసుకుంటున్నాడు. అయితే అతన్ని చాలా సేపటి నుంచి గమనిస్తున్న యువతికి అనుమానం కలిగింది. దీంతో చివరకు ఫోన్ గ్యాలరీలో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది..

Viral Video: ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటున్న వ్యక్తి.. సమీపానికి వెళ్లిన యువతి.. గ్యాలరీలో చూడగా..

మహిళలకు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు లైంగిక వేధింపులు ఎదురైతే.. మరికొన్నిసార్లు శారీరక వేధింపులకు గురవుతుంటారు. కొందరు శాడిస్టులైతే యువతులను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. చివరికి కొందరైతే ఏకంగా మహిళ లోదుస్తులను ఎత్తుకెళ్లడం కూడా చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తున్నాం. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వింత నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌లో వీడియోలు తీసుకుంటున్న వ్యక్తిపై యువతికి అనుమానం కలిగింది. దీంతో సమీపానికి వెళ్లి ఫోన్ గ్యాలరీ చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అంకుల్ చేతిలో ఫోన్ పట్టుకుని ఫొటోలు తీసుకుంటున్నాడు. అయితే అతన్ని చాలా సేపటి నుంచి గమనిస్తున్న యువతికి అనుమానం కలిగింది. దీంతో చివరకు సమీపానికి వెళ్లగా.. అతను ఏమీ తెలియనట్లు కెమెరా ఆఫ్ చేసి కూర్చున్నాడు.

Gas Stove Funny Video: గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..


దగ్గరికి వెళ్లిన ఆమె.. అతడి ఫోన్‌లోని గ్యాలరీ (Phone Gallery) చూపించాలని కోరింది. ఇందుకు అతను తటపటాయిస్తుండడంతో ఆమే స్వయంగా అతడి ఫోన్‌లోని గ్యాలరీ ఓపెన్ చేసింది. లోపల చూడగా యువతి కాళ్లను (man clicking photos of the young woman legs) వీడియోలు, ఫొటోలు తీసుకున్నట్లు కనిపించింది. అనుమతి లేకుండా ఎందుకు అలా వీడియోలు తీసుకున్నావంటూ.. అతడిపై ఆమె మండిపడింది. తన తప్పు బయటపడడంతో ఆ వ్యక్తి సైలెంట్‌గా ఉండిపోయాడు. తర్వాత వాటిని డిలీట్ చేసేశాడు.

Live Death Video: అడుగు దూరంలో మరణం.. గుండెల్ని మెలిపెట్టే సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇలా యువతి కాళ్లను వీడియో తీసిన ఈ వ్యక్తిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీయడం తప్పు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ వీడియో చూసి ఇతను ఎలాంటి వాడో.. ఇతడి భార్య, కూతురు కూడా తెలుసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,400కి పైగా లైక్‌లు, 3.91 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 12:36 PM