NRI: తానా ‘టాయ్ అండ్ గిఫ్ట్’ డ్రైవ్ విజయవంతం
ABN , Publish Date - Dec 26 , 2024 | 08:02 AM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూ ఇంగ్లండ్ చాప్టర్ టాయ్, గిఫ్ట్ డ్రైవ్‌ను జాగో వరల్డ్ ఛారిటీతో కలిసి విజయవంతంగా నిర్వహించింది.
ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూ ఇంగ్లండ్ చాప్టర్ టాయ్, గిఫ్ట్ డ్రైవ్‌ను జాగో వరల్డ్ ఛారిటీతో కలిసి విజయవంతంగా నిర్వహించింది. న్యూ ఇంగ్లండ్‌లోని అనాథ పిల్లలకు సంతోషం కలిగించేందుకు దాతలు ఇచ్చిన 1,500 డాలర్ల విలువైన బొమ్మలు, బహుమతులను సేకరించి పంపిణీ చేశారు. 3 నెలల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు దీనిని అందించారు. విజయ్ బెజవాడ, అరుణ్ చౌదరి, గోపి నెక్కలపూడి నేతృత్వంలోని టీమ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. న్యూ ఇంగ్లండ్ రీజినల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యుడు కృష్ణప్రసాద్ సోంపల్లి, బహుమతులను ప్యాకింగ్ చేయడంలో ఉదారంగా సహకారం అందించినందుకు, దాతలకు తానా నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు (NRI).
NRI: రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం నిజంగా భగవంతుడి నుండి వచ్చిన వరమని కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఈ డ్రైవ్ పిల్లలకు సహాయపడటమే కాకుండా సద్భావనను ప్రేరేపించి సంతోషపరుస్తుంది. జాగో వరల్డ్ ఛారిటీ వంటి సంస్థలతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసలను అందుకుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సమయాన్ని, కృషిని, వనరులను అందించిన ప్రతి దాతకి నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.