Pawan Kalyan: గుడివాడలో పవన్ కల్యాణ్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 05:23 PM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పవన్ కల్యాణ్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో సోమవారం పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పవన్ కల్యాణ్ పరిశీలించారు.
గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దృష్టికి గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము తీసుకురాగా... రూ. 3.8 కోట్ల నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు.
ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేశారు.
14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో సోమవారం పవన్ కల్యాణ్ మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు.
క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కి స్థానిక శాసనసభ్యులు వెనిగెండ్ల రాము ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ,
జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుడివాడలో జనసేన, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
పవన్ కల్యాణ్‌ను చూడటానికి ప్రజలు, అభిమానులు పోటెత్తారు. పవన్‌కు కూటమి నేతలు వీడ్కోలు పలికారు..
అభిమానులకు అభివాదాలు చేస్తూ.. మంగళగిరికి పవన్ కల్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు.
Updated Date - Dec 23 , 2024 | 09:50 PM