ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fengal Cyclone: ఏపీలో ఫెంగల్ తుఫాను బీభత్సం.. ఈ జిల్లాల్లో భారీవర్షాలు ...

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:12 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్‌ తుఫాను తీరం దాటింది.

1/13

ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

2/13

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

3/13

తుఫాన్‌ నేపథ్యంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

4/13

వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

5/13

రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని కోరారు. కాగా, తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

6/13

ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

7/13

తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, రోడ్లు, కాటేజీలు, బస్టాండ్‌, పార్కులు తడిసి ముద్దయ్యాయి. చలి గాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు.

8/13

సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు. సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు.

9/13

మరోవైపు ఫెంగల్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి.

10/13

టి.నగర్‌ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది.

11/13

మూడు రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్‌ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.

12/13

మరోవైపు, తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి.

13/13

చెన్నైవ్యాప్తంగా వరదనీరు చేరడంతో ఉపాధిలేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశముందనే కారణంగా శనివారం చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Dec 02 , 2024 | 02:15 PM