AP Elections 2024: వైసీపీకి మరో ఊహించని షాక్.. పవన్‌తో టచ్‌లోకి ఎమ్మెల్యే..!
ABN , Publish Date - Feb 03 , 2024 | 03:44 PM
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి ( YSR Congress) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ షాక్‌ల నుంచి తేరుకోకమునుపే ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో హైకమాండ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. మరికొందరు క్యూలో ఉన్నారు కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి ( YSR Congress) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ షాక్‌ల నుంచి తేరుకోకమునుపే ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో హైకమాండ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. మరికొందరు క్యూలో ఉన్నారు కూడా. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు తేల్చడంతో ఈ రెండు పార్టీల గూటికి సిట్టింగులు, అసంతృప్త నేతలు చేరిపోతున్నారు. మరోవైపు.. రెండ్రోజులకోసారి అధిష్టానం రిలీజ్ చేస్తున్న ఇంచార్జుల జాబితాతో వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయాయి. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇదీ అసలు కథ..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore) కీలక నియోజకవర్గం గూడూరు (Guduru). ఈ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపల్లి ప్రసాద్ రావుకు (Velagapalli Varaprasada Rao) రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పిన జగన్.. నియోజకవర్గానికి మేరుగ మురళిని (Meruga Murali) నియమించడం జరిగింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు.. నియోజకవర్గంలో కార్యకర్తలు, వైసీపీ వీరాభిమానుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే కీలక ప్రకటన చేయడానికి ఎమ్మెల్యే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చిన వరప్రసాద్.. సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఏ తప్పూ చేయను, విశ్వాస ఘాతకుడిని కాదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదు. సిలికా, క్వార్ట్, ఇసుక వ్యాపారాల్లో ఎప్పుడూ ఏదీ నేను ఆశించలేదు. ఐ ప్యాక్ సర్వేల (I Pac Survey) పేరుతో ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పు బాధాకరం. సర్వే పేరుతో 28 మంది అభ్యర్ధులని మార్పు చేస్తే, మేమంత చేతకాని వాళ్లమా?’ అని జగన్‌పై ఎమ్మెల్యే కన్నెర్రజేశారు.
జనసేనలోకి జంప్!
వైసీపీలో ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) స్నేహం కొనసాగించినట్లు వరప్రసాద్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేయాలనేదే తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. అంటే.. త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వరప్రసాద్ చెప్పేశారన్న మాట. అంతేకాదు.. జనసేనలో చేరిన తర్వాత పరిస్థితి ఏంటనేదానిపై కూడా వరప్రసాద్ స్పందించారు. టికెట్ విషయంలో పవన్ తనకు ఎటువంటి హామీ ఇవ్వలేదనే విషయాన్ని కూడా వరప్రసాద్ చెప్పుకొచ్చారు. సో.. దీన్ని బట్టి చూస్తే జనసేనలోకి జంప్ అయిపోతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? వైసీపీకి వరప్రసాద్ ఎప్పుడు గుడ్ బై చెబుతారన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి