ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు.. కేశినేని చిన్నీ మెజార్టీ ఎంత..?

ABN, Publish Date - May 21 , 2024 | 10:24 AM

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

  • కొద్దిరోజులుగా ఊగిసలాటలో బెట్టింగ్‌ బాబులు

  • రెండు రోజులుగా ఊపందుకున్న బెట్టింగ్‌లు

  • గన్నవరం, గుడివాడ, మైలవరం, విజయవాడ తూర్పు

  • ఈ నాలుగు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి

గన్నవరం, గుడివాడలో టీడీపీ (Telugu Desam) అభ్యర్థుల గెలుపు ఖాయమని మెజారిటీ 15వేలు పైచిలుకు వస్తుందని విజయవాడకు చెందిన ఓ బిల్డర్‌ రూ.5 లక్షలకు బెట్టింగ్‌ కాశారు.

మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్‌కు అవనిగడ్డలో మెజారిటీ వస్తుందని మచిలీపట్నంకు చెందిన ఓ రోల్డు గోల్డు వ్యాపారి రూ.10 లక్షలు బెట్టింగ్‌ కాశారు. ఈయనే మచిలీపట్నం ఎంపీగా కూటమి అభ్యర్థి బాలశౌరి గెలుస్తారని మరో రూ.10 లక్షలు పందెం కాశారు.


అంతుచిక్కట్లేదు!

ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో కొన్ని రోజులుగా సైలెంట్‌ అయిన బెట్టింగ్‌ రాయుళ్లు మళ్లీ బరిలోకి దిగారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే రెండు మూడు రోజులు జోరుగా మొదలైన బెట్టింగ్‌లు మధ్యలో కాస్త తగ్గాయి. ఫలితాలు తేలే రోజు దగ్గరపడుతుండటంతో మళ్లీ బెట్టింగ్‌ బాబులు జూలు విదులుస్తున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

లెక్కలివీ..?

కైకలూరు, నూజివీడుతోసహా మొత్తం 16 నియోజకవర్గాల పైనా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. గుడివాడ, మైలవరం, గన్నవరం, విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ స్థానాలపై సుమారు రూ.40 కోట్లు వరకు పందేలు జరిగి ఉంటాయని అంచనా. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటితోపాటు గతంలో ఉమ్మడి కృష్ణాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలనూ కలుపుకొని టీడీపీ, వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. మొత్తం 16 స్థానాలను కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందని.. కూటమికి 14, వైసీపీకి 2 వస్తాయని.. ఇలా రకరకాల లెక్కలతో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలు దగ్గరపెట్టుకుని పోలింగ్‌ సరళిని అంచనా వేసుకుని మరీ బెట్టింగ్‌ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. ఆయా బూత్‌ల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణనలోకి తీసుకుని గెలుపోటములను అంచనా వేస్తున్నారు. బూత్‌లవారీగా లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్‌కు దిగుతున్నారు.


ఎవరి పరిస్థితేంటి..?

  • విజయవాడ తూర్పులో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ మెజారిటీపైనా పందేలు నడుస్తున్నాయి. విజయవాడ పశ్చిమ, పామర్రులో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమని భావిస్తున్న నియోజకవర్గాల్లో మెజారిటీలపై పందేలు కాస్తున్నారు.

  • పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మెజారిటీ 20వేలు పైచిలుకు ఉంటుందని పందేలు నడుస్తున్నాయి.

  • విజయవాడ పార్లమెంటులో కేశినేని బ్రదర్స్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపైనా పందేలు కాస్తున్నారు. కేశినేని చిన్ని కనీసం 50వేల మెజారిటీతో గెలుస్తారని పందేలు నడుస్తున్నాయి.

గతంలో ఉన్న జోరు లేదు

గత ఎన్నికల్లో ఉన్న జోరు ఈసారి బెట్టింగ్‌ల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో లక్షలు దాటి కోట్లలో బెట్టింగ్‌లు నడిచాయి. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అధికార పార్టీ తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థి తన గెలుపుపై తానే బెట్టింగ్‌ కట్టుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. సుమారు రూ.1.50 కోట్లకు ఆయన బెట్టింగ్‌ కాసినట్లు చెబుతారు. ఆయన దెబ్బతో ఆ నియోజకవర్గం నుంచే సుమారు రూ.5 కోట్లు వరకు బెట్టింగ్‌లు జరిగాయి. వీరంతా అప్పట్లో ఫలితాలు తారుమారు కావడంతో నిండా మునిగిపోయారు. అప్పట్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కూడా కోట్లలో పందేలు నడిచాయి. ఈసారి ఆ జోరు కనిపించడం లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే జోరుగా సాగిన బెట్టింగ్‌లు ఆ తర్వాత సైలెంట్‌ ఓటింగ్‌ ఎటో అర్థం కాక నెమ్మదించాయి. గత వారం రోజులుగా సాగిన విశ్లేషణల అనంతరం గత రెండు రోజులుగా మళ్లీ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో సుమారు రూ.100 కోట్లపైచిలుకు బెట్టింగ్‌లు జరగ్గా ఈసారి అందులో సగం కూడా జరగలేదని సమాచారం.

Read Latest AP News and Telugu News


Updated Date - May 21 , 2024 | 10:27 AM

Advertising
Advertising