Viral: ఎంతటి కష్టం తల్లీ నీది! అర్ధరాత్రి 1 గంటకు ఆటో నడుపుతున్న మహిళ! | 55 year old single mother drives auto till 1 3 am shares her struggles pcs spl
Share News

Viral: ఎంతటి కష్టం తల్లీ నీది! అర్ధరాత్రి 1 గంటకు ఆటో నడుపుతున్న మహిళ!

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:04 PM

ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల కారణంగా సామాన్యుల వెతలకు సంబంధించిన ఉదంతాలు నిత్యం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ 55 ఏళ్ల మహిళ ఉదంతం నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది. ఎంత కష్టం తల్లీ నీకు అంటూ కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తోంది.

Viral: ఎంతటి కష్టం తల్లీ నీది! అర్ధరాత్రి 1 గంటకు ఆటో నడుపుతున్న మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల కారణంగా సామాన్యుల వెతలకు సంబంధించిన ఉదంతాలు నిత్యం నెట్టింట వైరల్‌ (Viral) అవుతున్నాయి. తాజాగా ఓ 55 ఏళ్ల మహిళ ఉదంతం నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది. ఎంత కష్టం తల్లీ నీకు అంటూ కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తోంది.

Viral: తండ్రి ప్రేమ అంటే ఇదీ! నెట్టింట వైరల్ అవుతున్న డెలివరీ ఏజెంట్ ఉదంతం

ABN ఛానల్ ఫాలో అవ్వండి

మహిళ ఆటో ఎక్కిన వ్యక్తి ఆమె కష్టం చూసి చలించిపోయాడు. ఉండబట్టలేక ఆమెతో మాట కలిపాడు. మీరు ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగానే ఆటో నడపడమే తన వృత్తి అని చెప్పుకొచ్చింది. ఇంత రాత్రి వేళ ఎందుకు ఆటో నడపడమని అడిగితే విధి లేక ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే, డబ్బుల కోసం ఇతరుల వద్ద చేయిజాచడం కంటే కష్టించి పని చేసుకోవడంలోనే గౌరవం ఉందని చెప్పుకొచ్చింది. ‘‘నాకు ఒక్కడే కొడుకు. అతడు ఏ పనీ చేయడు. నేనంటే అస్సలు గౌరవం లేదు. నిత్యం వచ్చి డబ్బులు అడుగుతాడు. ఇవ్వకపోతే నాతో గొడవ పడతాను. భర్త పోవడం ఇబ్బందులు తప్పట్లేదు’’ అని ఆమె గొంతులో బాధ ధ్వనిస్తుండగా తెలిపింది (55 year old single mother drives auto till 1 30 am shares her struggles).


కాగా, ఈ వీడియోను సదరు నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో జనాలు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆంటీని చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. తల్లికి మించి యోధురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు’’ అని అన్నారు. కొందరు మాత్రం ఆమె కొడుకుపై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వీడియోకు 62 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.


ప్రస్తుతం వైరల్ అవుతున్న మరో వీడియోలో ఓ డెలివరీ ఏజెంట్ తన రెండేళ్ల కూతురిని వెంట తీసుకుని పనిలోకి దిగాడు. ఆర్డర్ పికప్ చేసుకునేందుకు స్టార్‌బక్స్ వద్దకు వచ్చిన అతడిని చూసి సిబ్బంది చలించిపోయారు. కష్టాలకు ఎదురీదుతున్న అతడి ధైర్యం వారిని కదిలించింది. దీంతో, స్టోర్ మేనేజర్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. అంతేకాకుండా, ఆ చిన్నారికి తాము ప్రత్యేకంగా బేబీచీనో పానీయం కూడా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ ఉదంతం కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 05 , 2024 | 02:09 PM