Share News

Viral Video: ఎంత బ్రతిమాలుతున్నా వరుడు వినలేదని.. బంధువుల సమక్షంలోనే ఈ వధువు చేసిన పని..

ABN , Publish Date - May 31 , 2024 | 09:29 PM

ప్రస్తుతం సినిమాల్లో కూడా కనిపించని వింతలు, విశేషాలన్నీ నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో కనిపిస్తుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. వీటిలో...

Viral Video: ఎంత బ్రతిమాలుతున్నా వరుడు వినలేదని.. బంధువుల సమక్షంలోనే ఈ వధువు చేసిన పని..

ప్రస్తుతం సినిమాల్లో కూడా కనిపించని వింతలు, విశేషాలన్నీ నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో కనిపిస్తుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. వీటిలో కొన్ని వ్యూస్ కోసం క్రియేట్ చేసినవి కాగా, మరికొన్ని ఘటనలు అనుకోకుండా చోటు చేసుకుంటుంటాయి. మొత్తం మీద ఎలాంటి వీడియో అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎంత బ్రతిమాలుతున్నా వరుడు వినలేదనే కోపంతో వధువు చివరకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య ఉన్నట్టుండి సరదా సంఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న వధూవరుల వద్దకు వచ్చిన యువతి ప్లేటులో స్వీట్లు పట్టుకొస్తుంది. స్వీటను వరుడికి తినిపించాలని వధువుకు సూచిస్తుంది. దీంతో వధువు ప్లేటులోని స్వీటు తీసుకుని, వరుడికి తినిపించబోతుంది. అయితే వరుడు స్వీటు తినకుండా దూరం జరుగుతాడు. పదే పదే స్వీటు తినిపించాలని ఆమె ఎంత ప్రయత్నించినా వరుడు మాత్రం బెట్టు చేస్తూనే ఉంటాడు. దీంతో వధువుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ప్రేమతో తినిపిస్తే.. వెధవ వేషాలు వేస్తావా’’.. అన్నట్లుగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్‌‌లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..


వరుడి చేష్టలకు ఆగ్రహించిన వధువు.. ముందూ వెనుకా చూడగా చూడకుండా (bride slapped the groom) వరుడి మూతిపై ఫెడేల్‌మని కొడుతుంది. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వధువు ఆగ్రహం చూసి పక్కన ఉన్న వారు కూడా అవాక్కవుతారు. అయితే ఇదంతా సరదా కోసం చేసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు కోపం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి తర్వాత వరుడి పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

Updated Date - May 31 , 2024 | 09:34 PM