Share News

Viral Video: వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. గేదెల వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Oct 15 , 2024 | 02:03 PM

ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిలో పడాలనుకున్న ఓ వ్యక్తి.. చివరకు ఎవరూ చేయలేని పని చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడు. పునీత్ సూపర్ స్టార్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే ఓ వ్యక్తి.. ఇటీవల విచిత్ర విన్యాసం చేశాడు. గేదెల షెడ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. గేదెల వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..

కొందరు పొద్దున లేచినప్పుటి నుంచి రాత్రి పడుకునే వరకూ వ్యూస్, లైక్‌లు ఎలా తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఏదోటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఆత్రుతతో ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడరు. ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గేదెల వద్ద చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిలో పడాలనుకున్న ఓ వ్యక్తి.. చివరకు ఎవరూ చేయలేని పని చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడు. పునీత్ సూపర్ స్టార్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే ఓ వ్యక్తి.. ఇటీవల విచిత్ర విన్యాసం చేశాడు. గేదెల షెడ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి.. వాటి మూత్రాన్ని తాగాడు.

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..


గేదె మూత్రం పోసే సమంయలో తన తలను దాని కింద పెట్టి నోటిలో పడేలా చేశాడు. ఇలా పదే పదే తన నోటిలో (man drinking buffalo urine) గేదె మూత్రం పోసుకుంటూ పక్కనే ఉమ్మేశాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి.. ఆ తర్వాత అక్కడే ఉన్న గేదె పేడను ముఖానికి రాసుకున్నాడు. ముఖానికి రాసుకున్న తర్వాత.. తన శరీరం మొత్తం పేడను రద్దుకున్నాడు. ఇలా ఒళ్లంతా పేడ రద్దుకుని అక్కడే స్నానం కూడా చేశాడు. ఇలా విచిత్రమైన పని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Viral Video: లో బడ్జెట్ సీసీ కెమెరా.. ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవుగా..


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి టాలెంట్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టాలెంట్‌ను ఎవరూ కాపీ కొట్టలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 91 వేలకు పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 02:03 PM