Optical illusion: ఎండిపోయిన ఈ చెట్టుపై 5 పక్షులు ఉన్నాయి.. ఎక్కడున్నాయో చెప్పారంటే మీరు గ్రేట్..
ABN , Publish Date - Mar 22 , 2024 | 06:52 PM
ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో కొన్ని మన కళ్లని కూడా మోసం చేసే విధంగా ఉంటాయి. దృష్టి కోణం పూర్తిగా మారిస్తే తప్ప అందులోని ఫజిల్ అర్థం కాదు. కొన్ని ఫొటోలను ఎంతలా పరిశీలించినా అందులోని సమాధానం మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. ఇలాంటి ఫొటోలు ...
ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో కొన్ని మన కళ్లని కూడా మోసం చేసే విధంగా ఉంటాయి. దృష్టి కోణం పూర్తిగా మారిస్తే తప్ప అందులోని ఫజిల్ అర్థం కాదు. కొన్ని ఫొటోలను ఎంతలా పరిశీలించినా అందులోని సమాధానం మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. ఇలాంటి ఫొటోలు మన మెదడుకు వ్యాయామంలా ఉపయోగపడడంతో పాటూ ఏకాగ్రతను పెంచడంలో దోహదం చేస్తాయి. తాజాగా, ఈ తరహా ఇలాంటి ఓ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చెట్టుపై మొత్తం 5 పక్షులు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది. పైకి చూసేందుకు అక్కడ చెట్లు తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ మీకు తెలీకుండా ఆ చెట్టుపై మొత్తం (Birds hiding in the tree) 5 పక్షులు కూడా ఉన్నాయి. కానీ చూసేందుకు మాత్రం చెట్టు కొమ్మలు తప్ప.. ఇంకేమీ లేనట్లుగా అనిపిస్తుంది. అయితే ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ పక్షులను పసిగట్టడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం.. చెట్టుపై దాక్కుని ఉన్న పక్షులను కనిపెట్టేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడొచ్చు.
Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ తప్పు ఉంది.. దాన్ని కనిపెడితే మాత్రం మీరే జీనియస్..