Share News

Piyush Chawla: నీ కొడుకుతో కలిసి ఆడాకే తప్పుకుంటా.. రిటైర్మెంట్‌పై ప్రముఖ క్రికెటర్ కామెంట్!

ABN , Publish Date - Sep 13 , 2024 | 07:11 PM

తన రిటైర్మెంట్‌ గురించి పీయూష్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీ కొడుకుతో కూడా కలిసి క్రికెట్ ఆడాక రిటైర్ అవుతా అంటూ పృథ్వీ షాతో సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని చావ్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Piyush Chawla: నీ కొడుకుతో కలిసి ఆడాకే తప్పుకుంటా.. రిటైర్మెంట్‌పై ప్రముఖ క్రికెటర్ కామెంట్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిభ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా క్రీడల్లో రాణించొచ్చని ఎందరో మేటి ప్లేయర్స్ రుజువు చేశారు. క్రికెటర్లు (Cricket) ఎమ్ఎస్ ధోనీ, పీయూష్ చావ్లా (Piyush Chawla) లాంటి వారు ఇందుకు నిదర్శనం. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో ఇప్పటికీ ఆడుతూ తమ ప్రతిభ చాటుకుంటున్నారు. చావ్లాకు 35 ఏళ్లు కాగా ధోనీకి 43. అయినా ఇద్దరూ యువకులతో పోటీ పడుతూ తామేంటో నిరూపించుకుంటున్నారు. వారి రిటైర్మెంట్ గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా తమ ఆటతీరుతోనే వారు సమాధానం చెబుతున్నారు.

IND vs BAN: సరికొత్త రికార్డ్‌కి అడుగు దూరంలో రోహిత్.. అదేంటంటే..?


తాజాగా పీయూష్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మొదట మీరు రిటైర్ అవుతారా లేక ధోనీనా’’ అని పీయూష్‌ను షో వ్యాఖ్యాత ప్రశ్నించాడు. దీనికి అతడు బదులిస్తూ.. ‘‘ఓసారి పృథ్వీ షా నాతో మాట్లాడుతూ ఇప్పటికైనా రిటైర్ అవుతావా అని సరదాగా ప్రశ్నించాడు. ‘నేను సచిన్‌తో అడాను. ఆయన కుమారుడితో కూడా ఆడుతున్నాను. ఇప్పుడు నీ సహ క్రికెటర్‌గా ఉన్నాను. తరువాత నీ కొడుకుతో కూడా కలిసి క్రికెట్ ఆడి ఆ తరువాత రిటైర్ అవుతా’ అని బదులిచ్చా’’ అని పీయూష్ సరదాగా వ్యాఖ్యానించాడు.

Cricket: 21 ఏళ్ల యువకుడికి బీసీసీఐ పిలుపు.. అదృష్టం వరించనుందా..


పీయూష్ 2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచం కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఈ రెండు సందర్భాల్లో టీమిండియాకు ధోనీ నేతృత్వం వహించాడు. ఇక ధోనీ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా చావ్లా మాత్రం తన రిటైర్మెంట్ గురించి ఎటువంటి ప్రకటనా ఇప్పటివరకూ చేయలేదు.

IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్


కాగా గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా క్రికెటర్ మహ్మద్ షమీ ప్లేయర్ల రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మీరెప్పుడూ (మీడియా) క్రికెటర్ రిటైర్మెంట్ గురించి మట్లాడుతుంటారు. ఓసారి ధోనీని నేను ఇదే ప్రశ్న అడిగా. ఓ ప్లేయర్ ఎప్పుడు రిటైర్ కావాలి అని ప్రశ్నించా. ‘క్రికెటర్‌కు ఆట బోర్ కొట్టినప్పుడో లేక టీంలోంచి తరిమేస్తారని భావించినప్పుడో రిటైర్మెంట్ ప్రకటించాలి’ అని ధోనీ అన్నాడు. అసలు ఆట నుంచి ఎంజాయ్ చేయట్లేదంటే రిటైర్మెంట్‌కు దగ్గరైనట్టే’’ అని షమీ పేర్కొన్నాడు.

Read Latest Sports and Telugu News

Updated Date - Sep 13 , 2024 | 07:16 PM