Share News

షకీబ్‌ బౌలింగ్‌పై సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:23 AM

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌పై ఐసీసీ సస్పెన్షన్‌ విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ, లీగ్‌ స్థాయి....

షకీబ్‌ బౌలింగ్‌పై సస్పెన్షన్‌

దుబాయ్‌: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌పై ఐసీసీ సస్పెన్షన్‌ విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ, లీగ్‌ స్థాయి మ్యాచ్‌ల్లోనూ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తేల్చింది. రెండు రోజుల క్రితమే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా అతడి బౌలింగ్‌ను బ్యాన్‌ చేసింది.

సామి..ఇక అన్ని ఫార్మాట్లకూ

బ్రిడ్జిటౌన్‌ : మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి ఇకపై వెస్టిండీస్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం వన్డే, టీ20ల కోచ్‌గా ఉన్న సామి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటినుంచి టెస్టుక్రికెట్‌ కోచింగ్‌ బాధ్యతలు కూడా స్వీకరిస్తాడని క్రికెట్‌ వెస్టిండీస్‌ డైరెక్టర్‌ మైల్స్‌ చెప్పాడు. రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ నెగ్గిన వెస్టిండీస్‌ జట్టుకు సామి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Updated Date - Dec 17 , 2024 | 06:24 AM