Share News

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

ABN , Publish Date - Dec 09 , 2024 | 10:59 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీని ప్రారంభించి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా బీజేపీ కార్యాలయం వరకు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ర్యాలీ కోసం ఏసీపీ కార్యాల యంలో అనుమతి పెట్టుకుంటే ఎమ్మెల్యే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. నాయకులు రజనీష్‌జైన్‌, కృష్ణమూర్తి, అశ్విన్‌, రమణరావు, శ్రీదేవి, అవోక్‌, చక్రి, సదానందం పాల్గొన్నారు.

నస్పూర్‌, (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా యువ మోర్చ నిరసన ర్యాలీ నిర్వహించింది. తెలంగాణలో ప్రభుత్వమే మారిందని పాలన మాత్రం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీల గారడీ చేస్తుందని, ఆరు అబద్దాలు 66 మోసాలంటూ ముద్రించిన కరపత్రాలను కలెక్టర్‌ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పంపిణీ చేశారు.

సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు

మందమర్రి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం సాధించింది శూన్యమని బీజేపీ నాయకులు సంజీవరావు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక వైపు రైతులు వర్షాలతో పంట నష్టపోతే కనీసం సంబంధిత అధికారులు పంట నష్టం అంచనా వేయడం లేదని మండిపడ్డారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు.

Updated Date - Dec 09 , 2024 | 10:59 PM