Share News

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:02 PM

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తిం చాలని హౌజింగ్‌ డీఈ మునీందర్‌ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరి శీలించి మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి

కాసిపేట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తిం చాలని హౌజింగ్‌ డీఈ మునీందర్‌ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరి శీలించి మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం రూ.5 లక్షలను అందజేస్తుందని, అర్హులైన వారినే గుర్తించాలన్నారు.

మండల కేంద్రంలో నిర్మిం చే మోడల్‌ ఇందిరమ్మ హౌజ్‌ను నిర్మాణ స్థలా న్ని పరిశీలించారు. మోడల్‌ హౌజ్‌లో డబుల్‌ బెడ్‌రూం, కిచెన్‌, హాలు ఉండే విధంగా నిర్మాణం జరుగుతుందని, మోడల్‌ హౌజ్‌ ఆధారంగానే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ప్రజలు ఇందిరమ్మ మోడల్‌ హౌజ్‌ను పరి శీలించారు. హౌజింగ్‌ ఏఈ లాయకత్‌ ఆలీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, తహసీల్దార్‌ భోజన్న, ఎంపీవో షేక్‌ సప్దర్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 11:02 PM