తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:07 PM
తెలంగాణ ఉద్యమం సంద ర్భంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలను మార్చవద్దని నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అం దరూ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారన్నారు.

నస్పూర్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమం సంద ర్భంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలను మార్చవద్దని నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అం దరూ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారన్నారు.
తెలంగాణ తల్లికి కిరీటం, బతుకమ్మ, మరొక చేతిలో కంకి, వడ్డాన, ఒంటి నిండా బంగారంతో మహాలక్ష్మిగా విగ్రహా లను తయారు చేయించారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చుతున్నారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహా నికి మార్పులు లేకుండా యథవిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్‌కుమార్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, కుర్మిళ్ల అన్నపూర్ణ, నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, జనార్దన్ పాల్గొన్నారు.