ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR : కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది

ABN, Publish Date - Oct 24 , 2024 | 02:54 PM

ప్రజల కోసం తాను జైలుకు వెళ్లడానికి రెడీగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి‌పై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు.

ఆదిలాబాద్: జాతీయ కాంగ్రెస్‌ పార్టీకు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు విమర్శలు చేశారు. ఇవాళ( గురువారం) ఆదిలాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ రైతు పోరు బాట సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్రకు ఆర్ ఆర్ టాక్స్ కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు కూడా రోడ్డెక్కాల్సి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఉట్నూర్ పోలీసులు తనకు నోటీసులు ఇస్తారని చెప్పారని.. ప్రజల కోసం తాను జైలుకు వెళ్లడానికి రెడీగా ఉన్నానని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి‌పై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 2లక్షల ఉద్యోగాల హామీపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. అధికారం శాశ్వతం కాదు.. న్యాయం, ధర్మం ప్రకారం పోలీసులు వెళ్లాలని సూచించారు. అధికారులు ఎవరైనా హద్దు మీరితే వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతోనే తాము కొట్లాడామని, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు అతి చేయకండి, తాము అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదిలి పెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.


అమాయక రైతులపై అక్రమ కేసులు...

‘‘అమాయక రైతులపై రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.‘‘100 రోజుల్లో అన్నీ హామీలు అమలు చేస్తానని రేవంత్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. హామీలు అమలు చేయని వారిని తక్షణమే జైల్లో పెట్టాలి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి, కాంగ్రెస్ చేసిన మోసాలను అక్కడ ఉన్న మీ బంధువులకు ప్రజలు చెప్పాలి. రైతుల తరపున మేం కొట్లాడుతాం . కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు పెద్ద మోసగాళ్లు.. గుజరాత్‌లో పత్తి ధర రూ. 8800లు ఉంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు. ఇక్కడ కూడా పత్తి క్వింటాలుకు రూ. 8800ఇవ్వకుంటే ఊరుకోం. గుజరాత్ కంటే తెలంగాణ పత్తి చాలా నాణ్యతగా ఉంటుంది. పత్తి ధర విషయంలో బీజేపీతో కొట్టాడతాం. ఇక్కడ ఎంపీని గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని బీజేపీ చెప్పింది, ఇప్పటికీ అతీగతీ లేదు. ఢిల్లీలో జుమ్లా పీఎం, ఇక్కడ సీఎం ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి పంటకు బోనస్ ఇచ్చే దాకా వదిలేది లేదు. రైతుల వద్దకే వెళ్లి నిలదీద్దాం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు... భారత రైతు సమితి కూడా. బెల్లంపల్లి సమీపంలోని ఓరియంట్ సిమెంట్ పరిశ్రమపై అదానీ కన్ను పడింది, త్వరలో కొనుగోలు చేయబోతున్నారు. ఆ తర్వాత సింగరేణి సంస్థ కూడా అదానీ వరమవుతుంది. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు, ఇక్కడి ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీ రామరక్ష, కాంగ్రెస్ -బీజేపీ దొంగల చేతిలో నుంచి తెలంగాణను రక్షించుకుందాం’’ అని కేటీఆర్ అన్నారు.


రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట: జోగు రామన్న

కాగా.. రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఈ సందర్బంగా రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతు భరోసా ఎగ్గొట్టి ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మహిళలకు ఉచిత బస్సు మినహా మిగతా గ్యారంటీలు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని జోగు రామన్న ధ్వజమెత్తారు.


రైతులను మోసగించారు...

కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు లేనీ రాష్ట్రంగా పథకాలు అమలు చేస్తే, రేవంత్ 300 రోజుల పాలనలో ఇప్పటికీ 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జోగు రామన్న ఆరోపించారు. ఎకరానికి తమ ప్రభుత్వం పదివేల రైతుబంధు ఇస్తే, అవహేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రూ.15,000 ఇస్తామని నమ్మించి మోసగించారని మండిపడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ పేరిట కాలయాపన చేస్తూ రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం తీరును రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతామని హెచ్చరించారు. పత్తికి గుజరాత్ మార్కెట్లో ఒక ధర కల్పించి... రాష్ట్రంలో రు.7,520 ప్రకటించడం ఏంటనీ ప్రశ్నించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకున్న పేదలకు తులం బంగారం, రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఉచిత కరెంటు పేరిట మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని జోగు రామన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం ,చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 03:21 PM