Share News

గురుకుల విద్యాలయాలపై సవతి ప్రేమ

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:05 PM

రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌ ఆరోపించారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురుకుల బాట జిల్లా ఇన్‌చార్జీ చైతన్య, రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్‌ కుమార్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గురుకుల విద్యాలయాలపై సవతి ప్రేమ

నస్పూర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌ ఆరోపించారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురుకుల బాట జిల్లా ఇన్‌చార్జీ చైతన్య, రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్‌ కుమార్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల, సోషల్‌ వెల్ఫేర్‌ ఎస్సీ, ఎస్టీ, విద్యాలయాల్లో ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యాల యాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేం దుకు గత నెల 30 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాటను నిర్వ హించామన్నారు. తాము విద్యాలయాలకు వెళ్ళిన సమయంలో అడుగడుగున అడ్డంకులు, నిర్బం ధాలు ఎదురయ్యాయన్నారు. లోపలికి వెళ్లకుండా గేట్ల వద్ద ఇతరులకు ప్రవేశం లేదని ఫ్లెక్సీలు పెట్టారన్నారు. నాసిరకం ఆహారం వల్లనే విద్యా ర్థులు చనిపోయాయన్నారు. నాణ్యత లేని ఆహార పధార్థాలను పెట్టడంతో విద్యార్థులు అవ స్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలను భ్రష్టు పట్టించిందని ఆరోపిం చారు. నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్‌, రమేష్‌, గోగుల రవీందర్‌ రెడ్డి, వంగతిరుపతి, జనార్థన్‌, బేర సత్యనారాయణ, రవి గౌడ్‌, మెరు గు పవన్‌కుమార్‌, తిరుపతి, నియోజకవర్గాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 11:05 PM