Share News

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:49 PM

విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని లక్షెట్టిపేట సివిల్‌ కోర్టు న్యాయాధికారి మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ అన్నారు. శనివారం రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వ ర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

జన్నారం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని లక్షెట్టిపేట సివిల్‌ కోర్టు న్యాయాధికారి మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ అన్నారు. శనివారం రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వ ర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. సోషల్‌ మీడియా, చెడు అలవాట్లకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. బార్‌ అసోసి యేషన్‌ ప్రెసిడెంట్‌ గడికొప్పుల కిరణ్‌, జనరల్‌ సెక్రెటరీ రమేష్‌, ఏజీపీ సత్యం, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, న్యాయవాదులు రాజేశ్వర్‌ రావు, రాజారాంరెడ్డి, రవీందర్‌, రహ్మతుల్లా, సత్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 10:49 PM